ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను ప్రారంభించిన సర్పంచ్ లింగారెడ్డి

Submitted by lenin guduru on Thu, 29/09/2022 - 10:39
Sarpanch Lingareddy started Flexi Printing Shop

చిల్పూర్, సెప్టెంబర్ 28,(ప్రజా జ్యోతి): చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ రామ ప్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ షాపును చిల్పూర్ మండలం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చిన్న పెండ్యాల గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన గ్రామంలోనే ఫ్లెక్సీ, ప్రింటింగ్ షాపును ప్రారంభించడంసంతోషకరమైన విషయమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో   ప్రింటింగ్ షాప్ యజమానితోపాటు మండల రైతు కోఆర్డినేటర్ జనగాం యాదగిరి, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు ఇళ్లందుల సుదర్శన్, మామిడాల యాదవ రెడ్డి, గడ్డమీది సురేష్ కుమార్, భూక్యా శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.