దేవరుప్పుల బస్టాండ్ పై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు విచారణ

Submitted by bosusambashivaraju on Thu, 15/09/2022 - 12:35
RTC vigilance officers investigation on Devaruppula bus stand

దేవరుప్పుల సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి:-  దేవరుప్పుల మండల కేంద్రంలో గత 40 సంవత్సరాల క్రితం బస్టాండ్ నిర్మాణం కోసం ఓ వ్యక్తి భూమిని దానం ఇస్తే అందులో బస్టాండ్ నిర్మించారు. కాలక్రమేణా బస్టాండ్ నిరుపయోగంగా మారింది. ఇప్పుడు వారి వారసులు భూమిని లాక్కోవాలని చూస్తూ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే అయితే, సోమవారం ఆర్టీసీ విజిలెన్స్ అధికారి రామ్మూర్తి బస్టాండ్ ను పరిశీలించి వాస్తవ నివేదిక అందజేస్తాం అని తెలిపారు. కాగా బుదవారం రామ్మూర్తి దేవరుప్పుల గ్రామపంచాయతీలో బస్టాండ్ కి సంబంధించిన అన్ని పత్రాలను సేకరించి పరిశీలించారు. వాసవికతపై పలువురిని విచారించారు. అలాగే త్వరలో దీనికి సంబందించిన నిజా నిజాలను వెల్లడిస్తామని తెలియచేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.