పోడు భూముల పై సమీక్ష

Submitted by srinivas on Sun, 25/09/2022 - 14:21
Review of Waste Lands

మహదేవపూర్ సెప్టెంబర్ 24 ప్రజాజ్యోతి ..//.. మహదేవపూర్  మ౦డల ప్రజా పరిషత్ కార్యాలయము,లో పోడు భూములపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. .ఈ సమావేశంలొ తహసీల్దార్ శ్రీనివాస్  మాట్లాడుతూ టైమ్ లైన్ మ్యాప్ ద్వారా సర్వే నిర్వహించ బడుతుందని , గిరిజనులకు 2005 డిసెంబర్ 13 ముందే సాగులొ వుండాలని, గిరిజనేతరులు 2005 డిసెంబర్ 13 కంటే ముందు అంటే మూడు తరాలు సాగులొ వుండాలి లేదా 75సంవత్సరాలు సాగులొ వుండాలని  అన్నారు.. ఎ౦.పి.డి.ఓ శ౦కర్ మాట్లాడుతూ మహదేవపూర్ మ౦డలములో 3989 మ౦ది రైతుల ను౦డి అప్లికేషన్లు పోడుభూములలో సాగు చేస్తున్నట్లు దరఖాస్తు చేసుకొన్నారని,  వీరియొక్క దరఖాస్తులను సర్వేనె౦బరు వారిగా క్రోడీకరి౦చి ఫారెస్టు రికార్డులను మరియు దరఖాస్తు దారుల అప్లికేశన్లలో వ్రాసిన వాటిని సరిపోల్చుకొని కలెక్టర్  కార్యాలయము ను౦డి ఇవ్వబడిన షెఢ్యూల్ ప్రకారము గ్రామములో దరఖాస్తు దారుల సమక్షములో సర్వే నిర్వహిచాలని అన్నారు. పోడు భూములకు స౦బ౦ది౦చి ఎఫ్ ఆర్ సి కమీటీ సభ్యులు అయిన బీట్ ఆఫీసర్ , పంచాయతీ కార్యదర్షి, సర్వెయర్, వి.ఆర్.ఏ సభ్యులు  సర్వేలో పాల్గొనవలసి ఉంటుందని  తెలిపారు. ఈ సమావేశంలొ ఎంపీపీ బన్సోడ రాణిబాయి ,  ఎ౦.పి.డి.ఓ శ౦కర్ , తహసిల్దార్ శ్రీనివాస్, ఎఫ్.ఆర్.ఓ కమల , వివిధ గ్రామ ప౦చాయితీల సర్పంచులు, ఎ౦.పి.టి.సిలు, ఫారెస్టు బీట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.