పోరాటాల ఫలితమే పోడు భూముల పంపిణీ

Submitted by kareem Md on Tue, 13/09/2022 - 16:04
The result of the struggle was the distribution of waste lands
  • జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్
  • తెలంగాణ గిరిజన సంఘం హర్షం
  •  హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజన సంఘ నాయకులు

హలియా,సెప్టెంబర్13(ప్రజా జ్యోతి): గిరిజన,ప్రజా సంఘాలు,వామపక్షాల సుదీర్ఘ పోరాట ఫలితమే పోడు భూముల పంపిణీ అని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం హాలియా మున్సిపాలిటీలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.సమావేశానికి హాజరై ఆయన మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సాగు దారుల 3.45 లక్షల దరఖాస్తులను తక్షణమే పరిశీలించి సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు.పోడు భూముల పంపిణీ కొరకు జిల్లా మంత్రిని చైర్మన్ గా, కలెక్టర్ ను కన్వీనర్ గా జిల్లా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 140 ను విడుదల చేయడాన్ని తెలంగాణ గిరిజన సంఘం హర్షం వ్యక్తం చేశారు