సింగరేణి మంచినీటి పంపుల తొలగింపు రద్దు చేసుకోవాలి

Submitted by Srikanthgali on Fri, 02/12/2022 - 14:45
Removal of Singareni fresh water pumps should be cancelled

సింగరేణి మంచినీటి పంపుల తొలగింపు రద్దు చేసుకోవాలి

ప్రజలకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేనిదే పంపు కలెక్షన్లు తొలగించ రాదు

మంచినీళ్లు అందించుటకు సానుకూలంగా స్పందించిన సింగరేణి జిఎం

పలు సమస్యలపై జి ఎం కి వినతి పత్రాన్ని అందించిన సిపిఐ ప్రతినిధులు

 

 కొత్తగూడెం క్రైమ్  డిసెంబర్ 02 ప్రజాజ్యోతి :

రామవరం కార్మిక వాడల్లో కాలి క్వార్టర్లలలో రిటైర్డ్ కార్మికులు, వారి పిల్లలు నివాసముంటున్న క్వార్టర్ల విద్యుత్తు,పంపు కలెక్షన్లు, వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోక ముందే మంచినీటి కనెక్షన్లను తొలగించ వద్దని సిపిఐ ప్రతినిధి బృందం సింగరేణి కొత్తగూడెం జిఎం ఐజె రమేష్ కి వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచర్ల జములయ్య, సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామవరం లోని ఏడువార్డులప్రజలు వారి తాత, తండ్రులు సింగరేణిలోని పనిచేసి సింగరేణి కి వారి జీవితాలను అంకితం చేశారని ఈరోజు సొంత ఇల్లులు లేక ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లలో జీవనం సాగిస్తున్నారని అన్నారు. వీరు అనేక సంవత్సరాలు నుండి ఈ మంచినీళ్లపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.అలాంటి పరిస్థితుల్లో ఆ గృహములకు ఉన్న కరెంటు,మంచినీటి కలెక్షన్లను తొలగిస్తే వారి జీవితాలు అస్తవ్యస్తమవుతాయని జిఎంకు వివరించారు. మున్సిపాలిటీ నుండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అంతవరకు రామవరం లోని అన్ని వార్డులకు మంచినీళ్లు అందించాలని జిఎంకు విజ్ఞప్తి చేయగా జిఎం సానుకూలంగా స్పందించారని వారు అన్నారు. అలాగే సింగరేణి స్థలాలలో కాకుండా వారి సొంత స్థలాలలో ఇల్లులు కట్టుకునే వారికి అనుమతించాలని జిఎం కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ, నాయకులు పాషా, ఉన్నందాస్ గడ్డ శాఖ కార్యదర్శి ఎస్కే జలీల్ తదితరులు పాల్గొన్నారు.