దేవరుప్పుల కేజీబీవి ఘటనపై ఆర్ఢీఓ మధుమోహన్ విచారణ

Submitted by lenin guduru on Fri, 28/10/2022 - 20:18
ఫోటో

దేవరుప్పుల కేజీబీవి ఘటనపై ఆర్ఢీఓ విచారణ

  • వంటగదిని పరిశీలించిన ఫుడ్ ఇన్స్పెక్టర్

  • ఆందోళన చేసిన విద్యార్ధినుల తల్లిదండ్రులు, ప్రతిపక్ష నాయకులు.

  • ఆరోగ్యం కుదుట పడకుండానే దవాఖానా నుండి  విద్యార్ధినుల డిశ్చార్జ్

  • నీరసంగా ఉంది ఇంకా కోలుకోలేదు అని విద్యార్ధినుల ఆవేదన

దేవరుప్పుల, అక్టోబర్ 28, ప్రజాజ్యోతి:-

జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో గురువారం  రాత్రి బల్లి పడ్డ ఆహారాన్ని తిని  12 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే,
ఈ ఘటన పై ఆర్డీవో మధు మోహన్ శుక్రవారం విచారణ చెపట్టారు. 
విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని పాఠశాల సిబ్బందిని నిలదీశారు.  ఆర్డీఓ మధుమోహన్ విద్యార్థినిల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పరచి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. ప్రతిపక్ష నాయకులు, విద్యార్థినిల తల్లిదండ్రులు ఆర్డీఓ తో వాగ్వివాదానికి దిగారు.
వెంటనే హాస్టల్ లోని సిబ్బంది ని ఉద్యోగాలనుండి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ హాస్టల్ లో సిసి కెమెరాలు ఉంటే తెసేశారని, బాత్రూంలు సరిగా లేవని, తక్షణమే ఈ హాస్టల్ రూపురేఖలు మారిస్తేనే మాపిల్లలను ఇక్కడ చదివిస్తామని, లేకుంటే మా పిల్లలను మా ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు
ఆర్డీఓ ను కోరారు. అనంతరం ఫుడ్ఇన్స్పెక్టర్ స్వాతి వంటగదిని పరిశీలించి ఆహారపదార్ధాల మీద ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి తెలిపారు. ఈ ఘటన పై  కలెక్టర్ కు నివేదిక
అందించి సంబంధిత అధికారుల పై కటిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. అనంతరం  జనగామ ఏరియా దవాఖానా లో చికిత్స కోసం వెళ్లిన విద్యార్థినులను దవాఖానా సిబ్బంది డిస్చార్జ్ చేయగా వారు పాఠశాలకు చేరుకున్నారు. చేరుకున్న విద్యార్థినిలు చాలా నీరసంగా ఉందని, తల నొప్పి వస్తుంది అని, ఓపిక లేదని ఎక్కి ఎక్కి ఏడ్చారు. తల్లి తండ్రులు మా పిల్లలను చంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ఆవరణని, క్లాస్ రూంలను పరిశీలించి పై అధికారులకు తెలియపరచి అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ అశోక్ కుమార్, తహశీల్దార్ రవీందర్ రెడ్డి, డీఈఓ కె రాము, ఎమ్ఈఓ చంద్రారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవి రాథోడ్, డిసిడిఓ గౌసియా బేగం, ఎంపిపి బస్వ సావిత్రి మల్లేష్, సర్పంచ్ ఈదునూరి రమాదేవి నర్సింహారెడ్డి, హాస్టల్ ప్రిన్సిపాల్ సుకన్య, ఉప సర్పంచ్ తోటకూరి దశరథ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పెద్ది కృష్ణ మూర్తి గౌడ్, యూత్ అధ్యక్షులు బోనగిరి యాకస్వామి, తెరాస నాయకులు జోగు సోమనర్సయ్య, చింత యాదగిరి, తోటకూరి కిష్టయ్య,తదితరులు పాల్గొన్నారు.