జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్బంగా ర్యాలీ

Submitted by bheemaraidu on Thu, 15/09/2022 - 13:09
 Rally on the occasion of National Earthworm Day

జోగులాంబగద్వాల్ ప్రజాజ్యోతి ప్రతినిధి సెప్టెంబర్ 14,.  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో "నేషనల్ డివైర్మింగ్ డే" జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా బుధవారం గద్వాల జిల్లా యందు ర్యాలీ ప్రారంభించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్  ఆదేశానుసారం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శశికళ మరియు డాక్టర్ మారుతి నందన్ చేతుల మీదుగా జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ నందు గద్వాల జిల్లా అంగన్వాడి సెంటర్స్ టీచర్లు మరియు ఆశా వర్కర్లు, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ప్రాక్టీసింగ్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ తీయడం జరిగింది. ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశికళ మాట్లాడుతూ 1సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు 1,97,342 పిల్లలు ఉన్నారని 91 సబ్ సెంటర్లలో 627 మంది ఆశల కార్యకర్తలతో 712అంగన్వాడీ సెంటర్లలో, 690 అంగన్వాడి టీచర్లతో, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాల యందు మరియు అంగన్వాడి సెంటర్ల నందు ప్రతి పిల్లవానికి ఆల్బెండజోళ్ళు 400 ఎంజి టాబ్లెట్స్ వయసులవారీగా మాత్ర నమిలి మ్రింగి నీరు తాపాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ఎంఈఓ సురేష్, సిడిపిఓ వరలక్ష్మి, డి పి హెచ్ ఎన్ ఓ వరలక్ష్మి , సిహెచ్ఓ రామకృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి, ఎన్సిడి జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సబ్ యూనిట్ ఆఫీసర్ శివన్న, డాక్టర్ రవి, హెల్త్ సూపర్వైజర్ నరసింహులు, ఏఎస్ఓ తిరుమలరెడ్డి జిల్లా వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.