లాల్ బహదూర్ శాస్త్రికి రైల్వే జాక్ నివాళులు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:21
Railway Jack's Tribute to Lal Bahadur Shastri

కాజీపేట టౌన్‌, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./.. తెలంగాణ రైల్వే జాక్ అధ్వర్యంలో కాజీపేట ఈఎల్ఎస్ రైల్వే క్వార్టర్స్ కూడలి యందు ఉన్నటువంటి భారతదేశ ప్రధమ రైల్వే శాఖ మంత్రి, దేశ రెండవ మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి 118 వ, జయంతి సందర్భంగా శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్లో రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో మహబూబ్ నగర్ దగ్గర రైలు ప్రమాదం జరిగినప్పుడు, ఆ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే శాఖమంత్రిగా రాజీనామా చేశారని, అతను పదవీకాంక్ష లేనివారని, అదే విధంగా దేశ 2వ ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత పాకిస్తాన్ తో యుద్ధం అనివార్యం అయినప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం చేసి విజయాన్ని పొందారని అన్నారు. దేశంలో ఆహార కొరత ఏర్పడినపుడు జై జవాన్ జై కిసాన్ నినాదం తో దేశ ప్రజల్లో దైర్యాన్ని నింపిన సాహసోపేతుడని, అతడు మరణించిన సమయంలో తనకంటూ ఒక గజం స్థలం కూడా సంపాదించుకోలేదని, అలాంటి మహానుభావుడి జయంతి, వర్ధంతి, కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రైల్వే జాక్ డిమాండు చేస్తూ ఆయన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైల్వే జాక్ సలహాదారుడు ఎస్ ఆర్ వి. రావు, తెలంగాణ రైల్వే జాక్ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కోండ్ర నర్సింగారావు, కో కన్వీనర్లు  గుర్రపు సుధాకర్ రావు, జీ. భాస్కర్, ఎం.కె మూర్తి, ఎస్ సి ఆర్ ఎం యు డి ఎల్ ఎస్ బ్రాంచ్ సెక్రటరీ అనుమాల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ డి ఎల్ ఎస్ సెక్రటరీ శ్రీనుబాబు, బి.మల్లయ్య, ఎం.సురేష్ కుమార్, టి. ప్రవీణ్ కుమార్, డి. రవీందర్, శేరీఫ్, ఎం. మహేష్, తిరుపతి, సాయి రాజ్, రాము, ఎప్నేజర్, డి. వి రమణ, బి. ప్రశాంత్, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.