సీపీఎస్ రద్దు కోసం కట్టమైసమ్మ దేవాలయం వద్ద పూజలు

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 13:20
Pujas at Kattamaisamma temple for cancellation of CPS

దేవరకొండ-  సెప్టెంబర్ -07(ప్రజా జ్యోతి  )నల్లగొండ జిల్లా  :  మండల కేంద్రంలోని కట్టమైసమ్మ  దేవాలయం వద్ద    భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలి అన్న అభిమతం నెరవేరే వరకు ఏ చెట్టు కయినా,  ఏ  పుట్టకైన పూజలు చేస్తానని సీపీఎస్ రద్దు ఆకాంక్ష నెరవేరాలన్న ప్రబల  కాంక్షతో కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశానని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయిస్ అసోసియేన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘనందన్  బుధవారం  అన్నారు. ఆయన డిండి జలాశయం వద్ద గుడిలో   ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులు లక్షా యాభై వేలకు పైగా ఉన్నారని  రఘునందన్ చెప్పారు  .ఏ ఎన్నికలు వచ్చినా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం తర్వాత మర్చిపోవడం  ఓ   తంతుగా జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే రాజస్థాన్ బిహార్ జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు సీపీఎస్ రద్దుకు సానుకూల నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. సిపిఎస్ రద్దు అయ్యే వరకు చెట్టు కైనా పుట్టకైన  సరే పూజలు చేస్తామన్నారు  .తమ కంఠ శోష ను ఏ   దివ్యశక్తి అయినా ఆలకించి పాలకుల మనసు కరిగి తమ జన్మ ధన్యం అయ్యేలా భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలని ఆలయం చుట్టూ అసంఖ్యాక ప్రదక్షిణ  చేశారు .