ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం.

Submitted by Ashok Kumar on Tue, 30/08/2022 - 09:24
Public welfare is the duality of government.

 నర్సింహులపేట ఆగస్టు 29 ప్రజా జ్యోతి ; ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఆసరా పెంచిన కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ . అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అనధికాలంలోనే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి   చెరువులో  కుంటలు నింపి రెండు పంటలకు నీరు అందించిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని అన్నారు.

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు, రైతు బీమా,గొప్ప గొప్ప పథకాలను తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు అందిస్తున్న అలుపెరుగని యోధుడని కొనియాడారు.  రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచమంతా  విజ్రుమించీ  మానవాళి మనుగడకే  ముప్పు తెచ్చిందని ఆయన అన్నారు.

అందువల్లనే   ఆసరా పింఛన్లు ఇవ్వలేకపోయామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు  ఇవ్వని హామీలతో పాటు ఆసరా పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలోనే ఈసారి 10 లక్షల మందికి ఇస్తున్నామని ఆయన అన్నారు. డోర్నకల్  నియోజకవర్గంలో 9,000 మందికి, నరసింహుల పేట మండలానికి 962 మందికి ఆసరా పింఛన్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టేకుల సుశీల యాదగిరి రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైదం దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము, వైస్ ఎంపీపీ దేవేందర్, దామోదర్ రెడ్డి యాదగిరి రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, తహసిల్దార్, ఇది గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు,పార్టీ ముఖ్య నాయకులు, ఆసరా పింఛన్దారులు పాల్గొన్నారు.