రిజర్వేషన్లను ఉల్లంఘించిన ప్రభుత్వం పై నిరసన

Submitted by veerareddy on Thu, 08/09/2022 - 17:43
Protest against the government for violating reservations

 

ఉసిల్ల కుమార్ కెవిపిఎస్ రంగశాయి పేట ఏరియా ప్రధాన కార్యదర్శి

వరంగల్ జిల్లాప్రజాజ్యోతి09-09-2022.వరంగల్  కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రంగశాయి పేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తిమ్మాపూర్ క్రాస్ రోడ్ యందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రంగశాయిపేట ఏరియా కమిటీ ప్రధాన కార్యదర్శిఉసిల్ల కుమార్ మాట్లాడుతూ ఎస్సై,కానిస్టేబుల్ పరీక్ష నోటిఫికేషన్లలో రిజర్వేషన్లను ఉల్లంఘించిన ప్రభుత్వంఇది రాజ్యాంగ ఉల్లంఘన
కటాఫ్ మార్కుల  విషయంలో ఒకే విధానం సరికాదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది అన్నారుపరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసే విధానంలో తెలంగాణ ప్రభుత్వానికి గాని,తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కు గాని కనీస స్పష్టత లేదన్నారు.2022 ఏప్రిల్ 25న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష నోటిఫికేషన్ భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని  మండిపడ్డారు.ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల కనీస అరహత మార్కుల విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానం తీవ్రమైన అన్యాయం చేసే విధంగా ఉందన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యర్థులుకు తీవ్రమైన అన్యాయం జరిగింది అన్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 లోను, 2018 లోను పోలీస్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఓసి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించిందన్నారు.

ఇదే విధమైన విధానాన్ని  2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిందన్నారు. కానీ ఇటీవల కాలంలో 25 ఏప్రిల్ 2022 న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ లో ఓసీ,బీసీ,ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీస మార్కులు 30%.. అనగా అందరికీ సమానంగా నిర్ణయించడం అంటే దళిత బహుజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉల్లంఘించడమే అన్నారు. తక్షణమే 2015, 2018 నోటిఫికేషన్ కు అనుగుణంగా 2022 నోటిఫికేషన్ ను సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయిలో టీఎస్పీఎస్సీ , ఏపీపీఎస్సీ లాంటి,టెట్ లాంటి పరీక్షల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కట్ ఆఫ్ మార్కుల విధానంలో రిజర్వేషన్ విధానం వర్తింపజేస్తున్నారని ఇట్టి విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోని పారదర్శకత లేని ప్రశ్నాపత్రం
వెంటనే సవరించాలని ఉసిల్ల కుమార్  కోరారుఈ కార్యక్రమంలో సింగారపు ప్రకాష్ జన్ను ప్రవీణ్ వడ్డేపల్లి డేవిడ్ ఒనపాక కృష్ణ జిల్లా యాదగిరి ఎర్ర జేమ్స్ సారగొండ ఉమా జ్యోతి సునిత ప్రభాకర్ శిరీష శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు