చాకలి ఐలమ్మ ను అవమానపరిచిన ప్రకాష్ రెడ్డి ని బిజెపి నుండి సస్పెండ్ చేయాలి

Submitted by Sathish Kammampati on Sat, 17/09/2022 - 16:39
Prakash Reddy who insulted Chakali Ailamma should be suspended from BJP

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పై అనుచిత వాక్యాలు తగదు

లకడాపురం వెంకటేశ్వర్లు రజక సంఘాల సమాన్వయ సమితి జిల్లా కన్వినర్ నల్లగొండ

నల్లగొండ సెప్టెంబర్ 17(ప్రజాజ్యోతి)//.నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో లకడ పురం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దొరల గడీలను గడగడలాడించిన ధైర్యశాలి, వీరనారి, తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను తక్కువ చేసి మాట్లాడి, ఆమె చేసిన పోరాటం చాలా చిన్నదని అవహేళన చేసిన బిజెపి రాష్ట్ర సెక్రెటరీ ప్రకాష్ రెడ్డి మాట్లాడిన సిగ్గుమాలిన మాటలను తీవ్రంగా ఖండించారు. ప్రకాష్ రెడ్డి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నీకు తెలియకపోతే చరిత్ర చదువు అ ఆ లు రాని నీకు పార్టీ పదవులు ఇస్తే ఏమి మాట్లాడాలో? ఏది మాట్లాడకూడదో తెలియక పోయే ఐలమ్మ పోరాటం చేసేటప్పుడు నువ్వు చిన్నపిల్లవాడివి కావచ్చు ముక్కులో చీమిడి కారుతూ జారే లాగును ఒక చేత్తో పట్టుకొని మరొక చేతి బొటన వేలును నోట్లో వేసుకొని చీక్కుంటూ బజార్లు తిరిగినట్టుంది. అందుకనే ఏమి మాట్లాడాలో! ఏమి మాట్లాడకూడదో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను తక్కువ చేసి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలను దాటుకుంటూ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినా జైలు పాలు చేసినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగి దొరల గడీల్లో గడ్డి మొలిపించిన చరిత్ర ఐలమ్మది. ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం.

అట్లాంటి చరిత్ర కలిగిన ఐలమ్మని తక్కువ చేసి మాట్లాడతానికి కొంచెమైన సిగ్గుండాలి.నీవు చేసిన పనికి చాకలి జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలి.అందుకు తెలంగాణ రాష్ట్ర బిజెపి బాధ్యత వహించాలి. చాకలి జాతికి క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో బిజెపిని బండకేసి బాదడం ఖాయం మేము తలుచుకుంటే రాష్ట్రంలో బిజెపి నాయకులను గల్లీలో తిరగకుండా చేయగలం ఆసత్తా మా జాతికి ఉందని కచ్చితంగా చెప్పగలం.ఐలమ్మను అవహేళన చేసి మాట్లాడిన బిజెపి వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రకాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళ తో జాగ్రత్తగా లేకుంటే ఆ పార్టీ చాలా నష్టం జరుగుతుంది అన్ని తెలియచేస్తున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు కమ్మంపాటి శంకర్ దుర్గ పాల్గొన్నారు.