అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరన

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:05
Poster unveiling of International Week of Older Persons

 భూపాలపల్లి, సెప్టెంబర్ -26ప్రజాజ్యోతి.  సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ముద్రించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ, వయో వృద్ధులను గౌరవిస్తూ మర్యాద ఇచ్చే గొప్ప సంస్కృతిమనదని, వారితో గౌరవంగా ఉంటూ,  ప్రేమతో మసలుకోవాలి అని అన్నారు.ప్రభుత్వం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1, 2022 వరకు వారం రోజుల పాటు వృద్ధుల కోసం వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, సెప్టెంబర్ 25న, 26న వృద్ధాశ్రమాలలో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని,  సెప్టెంబర్ 27న వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007, నియమావళి రూల్స్ 2011 పై అవగాహన కార్యక్రమాలు, సెప్టెంబర్ 28న గ్రామ సర్పంచులకు వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించడం, సెప్టెంబర్ 29న అంగన్వాడీ కేంద్రాలలో  వృద్ధులకు, చిన్నారులకు అనుబంధం పెంచుటకు పేరెంట్స్ డేనిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 30న వృద్ధుల హక్కులపై అవగాహన కల్పిస్తూ నడక కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు వివరించారు.
వృద్ధుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని , ఆసరా పెన్షన్లు, మొబైల్ మెడికేర్ యూనిట్స్, ఫిజియోథెరపీ కేంద్రాలు, డే కేర్ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ముఖ్యంగా మహిళల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  వయోవృద్దులకు పోషణ, సంక్షేమ చట్టం 2007, నియమావళి రూల్స్ 2011 అమలుచేయడంతో పాటు, వయో వృద్ధులను నిర్లక్ష్యం చేస్తూ మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక వేధింపులకు గురి చేసిన పక్షంలో టోల్ ఫ్రీ నంబర్14567 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, విచారించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈ  కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శామ్యూల్,వృద్దులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.