కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించిన పోలీసులు

Submitted by bosusambashivaraju on Fri, 30/09/2022 - 14:50
Police conducted a cordon and search

 సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం..ఏసిపి  రఘు చందర్ 

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 29 ( ప్రజాజ్యోతి ) :-  స్టేషన్ ఘనపూర్ మండలం లోని పామునూర్ గ్రామంలో గురువారం స్టేషన్ ఘనపూర్ సబ్ డివిజన్ పోలీసు వారి ఆధ్వర్యంలో కార్డెన్  అండ్ సర్చ్ నిర్వహించారు .  ఈ తనిఖీల్లో భాగంగా  సరైన పత్రాలు లేనటువంటి 10 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసీపీ రఘు చందర్ మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా లైసెన్స్,  ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని,  ప్రతి ఒక్కరూ రోడ్డుపై వెళ్తున్నప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని అన్నారు . గ్రామ ప్రజలు మీ యొక్క ఓటీపీ నంబర్లు ఎవ్వరికీ చెప్పవద్దు, ఎందుకంటే ఏ బ్యాంక్ వాళ్ళు  పిన్ నంబర్లు చెప్పమని అడగరని తెలిపారు . అదే విధంగా సోషల్ మీడియాలో  మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు అని అన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా  4జి అనగా గంజాయి , గుడుంబా,  గ్యాంబ్లింగ్,  గుట్కా లాంటి చెడు వ్యసనాలకు  బానిస కావద్దు.  అదే విధముగా ముఖ్యంగా యువత గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతోందని, అందుచేత తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ముఖ్యంగా గ్రామ ప్రజలకు తెలియజేయునదేమనగా    ఊరికి చివరన ఇల్లులు కలిగినవారు  జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఏదైనా శుభకార్యాలకు లేదా దూర ప్రయాణాలు చేయదలచిన వారు మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకుని వెళ్లవలసిందిగా సూచించారు.  ఈ కార్యక్రమంలో  స్థానిక స్టేషన్ ఘనపూర్ సీఐ అల్లె రాఘవేంద్ర,  జనగామ రూరల్ సీఐ సంతోష్ , స్టేషన్ ఘనపూర్ ఎస్సై బండి శ్రావణ్ కుమార్ , చిల్పూర్ ఎస్సై రాజు , లింగాల ఘనపూర్ ఎస్సై రఘుపతి , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.