గట్టుప్పల్ లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Submitted by veeresham siliveru on Mon, 05/09/2022 - 08:56
Photo write up: Former MLA Komatireddy Rajagopal Reddy speaking in Gattuppal
  • తెలంగాణ విముక్తి కోసం బిజెపిని గెలిపించండి 
  • తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సంస్థ నారాయణపురం సెప్టెంబర్ 4, ప్రజా జ్యోతి: కెసిఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి లభించాలంటే మునుగోడులో బిజెపిని గెలిపించాలని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గట్టుప్పల మండల కేంద్రంలో ఆదివారం నాడు బిజెపి కార్యకర్తల సమావేశం జరిగింది. గట్టుప్పల మాజీ సర్పంచ్ నావని గోపాల్ తో సహా పలువురు కాంగ్రెస్ నుండి  బిజెపిలో చేరారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ తన కబంధహస్తాల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు అన్ని  మృగ్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించకుండా కేవలం మూడు నియోజకవర్గాలనే అభివృద్ధి చేసుకున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు.

గత మూడున్నర సంవత్సరాలుగా మునుగోడుకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం వల్లనే తాను అసెంబ్లీలో గలమెత్తారని వివరించారు. ఉప ఎన్నికల వచ్చిన చోటనే కెసిఆర్ నిధులు ఇస్తుండడం వల్ల తాను కూడా అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామా వల్ల గట్టుపల్ మండలం ఏర్పడిందని,  పెన్షన్లు మంజూరయ్యాయని , రోడ్లు,  ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేశారని గుర్తు చేశారు.

కెసిఆర్ ప్రాజెక్టుల పేరుతో ఇతర అవినీతి కార్యక్రమాలతో దోచుకున్న డబ్బులు ఎన్నికల్లో ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నాడని ఆలోచించారు. కెసిఆర్ ఇచ్చే డబ్బులు తీసుకొని బిజెపిని గెలిపించాలన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టి తన పదవిని తెచ్చుకున్నాడని విమర్శించారు. పలు కేసులలో నిందితుడైన రేవంత్ రెడ్డి తనకు నీతులు చెబుతున్నారని ఆరోపించారు. బిజెపిని గెలిపిస్తే తెలంగాణ కెసిఆర్ చేతి నుంచి విముక్తి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిజెపిని భారీగా చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కోమటి వీరేశం యాస అమరేందర్ రెడ్డి కాసాల జనార్దన్ రెడ్డి పల్లె వెంకన్న సురేందర్ రెడ్డి తోటి వెంకన్న అన్నపర్తి యాదగిరి చేపూరి యాదయ్య దత్తాత్రేయ శంకర్ రాము సైదులు రవితేజ తదితరులు పాల్గొన్నారు.