పనికి తగ్గ కూలీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:51
 People who are facing low wages or financial difficulties

-రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నారీ ఐలయ్య

నాంపల్లి, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి ):   ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాంపల్లి మండల రెండవ మహాసభ గట్లమల్లెపల్లి గ్రామంలో కొమ్ము లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య  పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు పనికి తగ్గ కూలి లేక ఇబ్బందులు పడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి 600 ఇవ్వాలని ఉపాధి హామీ పనులు పని దినాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి ప్రజలు దగ్గర్లోనే ఉన్నాయని, బుద్ధి చెప్పే రోజులని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈనాటికి కూడా ఇంటి జాగలేక ఇల్లు లేక కూలీలుబాధపడతా ఉంటే ప్రభుత్వాలు  నిమ్మకునీరెక్కినట్టుగానే ఉన్నాయని ఆయా గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూములు కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూలి రేట్లు పెంచేంతవరకు వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాన్ని కొనసాగిస్తుందని కూలీలకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.అనంతరం నాంపల్లి మండల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.15 మందితో ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షుడిగా గడ్డం యాదయ్య ప్రధాన కార్యదర్శిగా కొమ్ము లక్ష్మయ్య ఉపాధ్యక్షులుగా అన్నేపాక శేఖర్, సహాయ కార్యదర్శిగా రెడ్డి మల్ల జయమ్మ,మరో 11 మందితో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యం మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, రైతు సంఘము జిల్లా కార్యదర్శి వార్సిపాక ముత్తిలింగం మండల నాయకులు గడ్డం గురుమూర్తి,సోమేశ్ సైదులు తదితరులు పాల్గొన్నారు.