పాలనాధి కారి పంతులైన వేల

Submitted by srinivas on Sat, 03/09/2022 - 17:50
Palanadhi Kari Thousands of flowers

టేకుమట్ల (మొగుళ్లపల్లి )సెప్టెంబర్ 02, ప్రజాజ్యోతి ; పాలనా ధి కారి పంతులుగా మారాడు జిల్లా పాలనలో బిజీ బిజీ గా ఉండే కలెక్టర్ పాఠాలు చెపుతూ పిల్లలతో మమేకమైన అరుదైన దృశ్యానికి టేకుమట్ల కస్తూరీ బ గాంధీ బాలికల విద్యాలయం వేదికైంది.మండలకేంద్రంలోని కేజీబివి స్కూల్లో కలెక్టర్ భవేష్ మిశ్రా ఉపాద్యుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోదించారు.

జిల్లా కలెక్టర్ శుక్రవారం రోజున కేజీబివి ని  ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల సమస్యలను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మెనూవారీగా భోజన సౌకర్యాలు అందిస్తున్నారా అంటూ ఆరాతీశారు. క్లాస్ రూమ్ లోకి వచ్చి ఇంగ్లీష్, ఫిజిక్స్ అంశాలను బోధించి అందులో విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించారు.  విద్యార్థులు కష్టపడి చదువకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలని సూచించారు. విద్య గొప్ప సంపదని, ఎవరు దోచుకొనిది విద్య మాత్రమేనని, ఎంత పంచిన తరగని గొప్ప సంపదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయ్యినీలు విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.