సద్దుల బతుకమ్మ కు ప్రతి మహిళ అకౌంట్ లో వెయ్యి రూపాయలు జమ చేయాలి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:19
One thousand rupees should be deposited in the account of each woman to Saddula Bathukamma
  • బతుకమ్మ చీరల పంపిణీ లో పెద్ద అవినీతి 
  • కోట్లల్లో దోచుకుంటున్నా   బకాసురులు
  • మహబూబాబాద్ వైస్ ఎంపిపి యెల్ది మల్లయ్యగౌడ్

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు చీరలకు బదులు వెయ్యి రూపాయలు వారివారి అకౌంట్లో జమ చేయాలని మహబూబాబాద్ వైస్ ఎంపిపి యెల్ది మల్లయ్యగౌడ్ అన్నారు.శుక్రవారం మండలంలోని అమనగల్ గ్రామంలో జరిగిన చూర్ల పంపిణి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్  పూజరి మంగమ్మ,జడ్పిటీసి సభ్యురాలు  లూనావత్ ప్రియాంకలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చీరల తయారీ ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నప్పటికి వారి ఉపాధి కంటే కూడ దీనిలో జరిగే అవినీతి కోట్లలో ఉందన్నారు. చేనేత కార్మికుల పేరు చెప్పి సూరత్ తదితర ప్రాంతాల నుండి యాబై రూపాయల చీరలు అందించి మహిళలను అవమాన పరుస్తున్నారన్నారు.చేనేత చీరలకు,సూరత్ చీరలకు తేడా తెలియని అమాయక మహిళలెవ్వరు తెలంగాణలో లేరన్నారు. సద్దుల బతుకమ్మ రోజు ప్రభుత్వం పంపిణి చేసిన చీరలు ఏ ఒక్క మహిళ కూడ కట్టుకుని రాదని,కాగితాలు ఏరుకుని బతికే కుటుంబం,కడు బీద కుటుంబ మహిళలు సైతం ఇటువంటి చీరలు పండుగ రోజు ధరించరన్నారు.ప్రభుత్వం మరియు అధికారులు,అధికార పార్టి ప్రజా ప్రతినిధుల కమీషన్ల వలన పంపిణి చేసే ఒక్కొక్క చీర ఖరీదు రూ 1850 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుందన్నారు.వచ్చే ఏడాది నుండి ప్రతి మహిళ చీర కొరకు వెయ్యి రూపాయలు వారివారి ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి ఉపెందర్ యాదవ్,పూజరి వెంకన్న,ధర్మారపు యాకసాయిలు,బాబా,పద్మ,సావిత్రమ్మ,భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.