వీఆర్ఏల మొర వినేదెవ్వరు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:05
No one listens to the VRAs

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి)../ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ ల పట్ల చిన్నచూపు చూస్తోందని వీఆర్ఏల సంఘం ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు ములుగు జిల్లా వెంకటాపురం తహశీల్దారు కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 60 వ రోజుకు చేరుకున్నాయి. రెండు నెలల నుంచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ఇంతవరకు తమ గురించి పాలకులు, అధికారులు జోక్యం చేసుకోలేదని వాపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి  హామీలు పే స్కేల్ జీవో, సర్వీస్ ప్రకారం వీఆర్ఏలకు ప్రమోషన్స్,  వయస్సు పైబడిన వీఆర్ఏల వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని  ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఈనిరవధిక సమ్మెనుకొనసాగిస్తామని హెచ్చరించారు.   శిభిరం వద్ద     న్యాయమైన డిమాండ్స్  ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేశారు. 
వీఆర్ ఏ ల సంఘం మండల  అధ్యక్షులు కంటెం బలరాములు,ఉపాధ్యక్షులు రేగ రాజేష్ ,కార్యదర్శి ఉండం శిరీష ,అరుణ , రజిత,సమ్మక్క , సమ్మయ్య  ,రామస్వామి,ముసలయ్య,తిరుపతమ్మ ,లక్ష్మయ్య ,కళ్యాణి , బాబ్జి,పాల్గొన్నారు