నైజాం వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులు చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి

Submitted by Sathish Kammampati on Sat, 17/09/2022 - 15:57
 Nizam fought against communists  BJP distorting history

నల్లగొండ సెప్టెంబర్ 17(ప్రజాజ్యోతి) //. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులేనని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.శనివారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఎం ఆఫీసు నుండి బైక్ ర్యాలీ కోర్టు,బస్టాండు వయా రామగిరి టెంపుల్, పెద్దగడియారం,మైసయ్య విగ్రహం, ప్రకాశం బజార్, కలెక్టరేట్ ,పెద్ద బండ,మీదుగా బస్టాండ్ సుభాష్ విగ్రహం దగ్గర ముగింపు  సభ జరిగింది.ముఖ్య అతిధి గా హాజరైన ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భూస్వాములు దొరలు రజాకారుల అండతో పేదలపై దాడి చేస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటున్న తరుణంలో ఎర్రజెండా నాయకత్వంలో కమ్యూనిస్టులు వ్యక్తి చాకిరిని రద్దు చేయాలని దున్నేవారికి భూమి దక్కాలని సాయుధ పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అమరత్వంతో ఉద్యమము ఉవ్వెత్తున లేసి రజాకారులను తరిమికొట్టి  దాకా వెళ్ళిందని అన్నారు.బిజెపి చరిత్రను వక్రీకరిస్తూ కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజామును లొంగదీశారని తెలంగాణ విముక్తి చేశారని మతం రంగు పులుముతూ వక్రభాష్యం చెపుతుందని ఆరోపించారు.నైజామ్ ను  లొంగదీస్తే రాజభరణాలు చెల్లిస్తూ గవర్నర్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.కమ్యూనిస్టులను అనుచడానికి కేంద్ర బలగాలు కుట్ర చేశాయని ఆరోపించారు.రజాకార్ల పాలన నుండి వేల గ్రామాలను గ్రామ స్వరాజ్యాలుగా ప్రకటిస్తూ పదివేల ఎకరాలకు పైగా భూ పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులను అన్నారు. పోరాటంలో గాని ఆనాడు కనీస రాజకీయ పార్టీగా కూడా లేని బిజెపి చరిత్రలో వక్రీకరిస్తూ తెలంగాణ పోరాటాలను కించపరుస్తూ మాట్లాడడం సరికాదని అన్నారు.

బైక్ ర్యాలీ అనంతరం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సయ్యద్ హాశమ్, బండా శ్రీశైలం  జిల్లా కమిటీ సభ్యులు దండెం పల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి,  తుమ్మల పద్మ, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, కుంభం కృష్ణారెడ్డి ,అద్దంకి నరసింహ, భూతం అరుణకుమారి, మధుసూదన్ రెడ్డి ,గుండాల నరేష్ మారగోని నగేష్, మహబూబ్ అలీ, కారంపూడి రాము, ఉమారాణి, బాతుకు సత్తయ్య, సుందరయ్య, మారయ్య, సైదులు, నగేష్,మంజుల, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.