మున్సిపల్ కార్యాలయంలో 'డాక్టర్ కేర్' ఉచిత మెగా హోమియోపతి వైద్య శిభిరం.

Submitted by Praneeth Kumar on Fri, 06/01/2023 - 16:56
At Municipal Office campus 'Doctor Care' conducted free mega homeopathy camp.

మున్సిపల్ కార్యాలయంలో 
'డాక్టర్ కేర్' ఉచిత మెగా హోమియోపతి వైద్య శిభిరం.

ఖమ్మం అర్బన్, జనవరి 6, ప్రజాజ్యోతి.

శుక్రవారం ఖమ్మంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో 'డాక్టర్ కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో కార్యాలయం సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఎస్ఎంఓ జిహెచ్డి డాక్టర్ కేసిహెచ్ నరసింహారావు పాల్గొని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కేర్ వైద్యురాలు ఎడ్లపల్లి వీణశ్రీ బిపి, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి అక్యూట్, క్రానికల్ రుగ్మతులకు హోమియోపతి వైద్యం ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్ఎంఓ జిహెచ్డి డాక్టర్ కేసిహెచ్ నరసింహారావు 'తెలంగాణా ప్రభుత్వ ఆయుష్ ఆరోగ్య కరదీపికను' విడుదల చేసి డాక్టర్ కేర్ సహకారంతో వైద్య పరీక్షలు చేయించుకున్న వారందరికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ హోమియోపతి వైద్యం ప్రాముఖ్యతను ప్రజల్లో కి తీసుకువెళ్తున్నందుకు 'డాక్టర్ కేర్' సంస్థ సిఈఓ డాక్టర్ ఏఎం రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు మాట్లాడుతూ మున్ముందు ఇలాంటి క్యాంపులు మరెన్నో నిర్వహించి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ హోమియోపతి వైద్యం పట్ల అవగాహనను మరింత ముందుకు తీకువెళ్లే బాధ్యతను డాక్టర్ కేర్ సంస్థ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ వి స్వాతి శ్రీ, ఇతర సిబ్బంది, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, డ్వాక్రా పొదుపు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.