లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను సందర్శించిన మున్సిపల్ చైర్మన్

Submitted by bheemaraidu on Sat, 01/10/2022 - 13:15
Municipal Chairman visited rainwater harvesting sites in low lying areas

◆ ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ౼ చైర్మన్ 

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 34,35వ, వార్డ్ కుంట వీధి, చిన్న అగ్రహారంలో వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్ శుక్రవారం ఉదయం వార్డు కౌన్సిలర్లతో కలిసి వెళ్లి వార్డులో మురికి కాలువలు, డ్రైనేజీ మరియు లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏలాంటి ఇబ్బందులు కలిగిన ఎవరు అధైర్య పడవద్దు అని,   అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు,సహాయ చర్యలు అందించేందుకు గద్వాల్ ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండల పాండు, కృష్ణ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.