చిల్పూర్, సెప్టెంబర్ 22, ప్రజా జ్యోతి: జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ కి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ రాఘవేందర్ కు చిల్పూరు మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువానుతో సన్మానించి,పూల బొకేను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ రంజిత్ రెడ్డి,నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్ గౌడ్, ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు గడ్డమీది వెంకటస్వామి, చిల్పూర్ మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూక్య రమేష్ నాయక్, సీనియర్ నాయకులు మారబోయిన ఎల్లయ్య, మాజీ మండల అధ్యక్షుడు గుర్రపు వెంకటేశ్వర్లు, మంతెన రాజు తదితరుల పాల్గొన్నారు.
- 3 views