మండల పరిషత్ సర్వసభ సమావేశంలో హాజరైన ఎమ్మెల్యే

Submitted by Thirumal on Thu, 15/09/2022 - 17:17
MLA who attended Mandal Parishad Assembly meeting

జోగులాంబ గద్వాల్ జిల్లా సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి): ..గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు మండల అభివృద్ధి భాగంలో పలు అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగినది. 

 గద్వాల్ ఎమ్మెల్యే  మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్వాల నియోజకవర్గంలో పాటు మండలాలు గ్రామాల అభివృద్ధి కొరకు అహర్నిశలు సీఎం కేసీఆర్ కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు. 

వ్యవసాయ రంగంపై సమీక్ష 

గతంలో కన్నా ఇప్పుడు వ్యవసాయ రంగం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది రైతుల అభివృద్ధి కోరకు సీఎం కేసిఆర్ రైతుబంధు, రైతు బీమా 24 గంటల ఉచిత విద్యుత్తు అందజేస్తూ రైతు శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేయడం అదేవిధంగా వ్యవసాయ మండలాధికారులు ఆయా గ్రామాల్లో చాలామంది రైతులు రైతు బీమా సంబంధించిన అప్లికేషన్లు నమోదు చేసుకోలేదు వెంటనే వారిని గుర్తించి పేద రైతులకు రైతు బీమా సంబంధించిన వారి పేర్లు నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

  విద్య శాఖపై సమీక్ష 

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అహర్నిశలు చేయడం జరుగుతుంది ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెట్టడం జరిగింది, అదేవిధంగా మన ఊరి మనబడి కార్యక్రమం లో భాగంగా పాఠశాలలో అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుంది, మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేయాలి కొన్ని గ్రామాలలో  మన ఊరి మన బడి సంబంధించిన పనులు ఆగిపోవడం జరిగింది వెంటనే అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని కోరారు.

  వైద్య మరియు ఆరోగ్య పై సమీక్ష 

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం సంక్షేమంకై ఆర్నిశలు ప్రజల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు ప్రభుత్వాసుపత్రిలు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది, ప్రతి గ్రామంలో బస్తీ దవాఖాన  ఏర్పాటు చేయడానికి తొమ్మిది గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడం జరిగింది వీటిలో ప్రజలకు ఎలాంటి సౌకర్యం లేకుండా దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలోని మెరుగైన వైద్యం చికిత్స లభించేలాగా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని  మండలంలో శిశు మరణ శాతాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. 

    ఇందిరా కాంతి పథకంపై సమీక్ష 

  ఇందిరా కాంతి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది మరియు వారి ద్వారా వడ్డీ రూపంలో వసూలు చేయడం జరుగుతుంది ఇలా కాకుండా ఈ రుణాలను గ్రామంలోని మహిళలకు స్మాల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి వారికి ఉపాధిని కల్పించి వారు కూడా ఆర్థికంగా ఇదే విధంగా కృషి చేయాలని కోరారు.

పశు సంవర్థక శాఖ సమీక్ష 

  మండలంలోని పశు సంవర్థక శాఖ  పశువులకు మెరుగైన వైద్యం అందజేయాలి ప్రస్తుతం వానకాలం కావడంతో రకరకాల గడ్డి తినడం వల్ల గొర్రెలు మేకలు చనిపోవడం జరుగుతుంది ఇలాంటివి జరగకుండా వాటి నిర్వారణకు మందులను వేసి వాటిని సంరక్షించే విధంగా ప్రయత్నించాలని సూచించారు.

ఉపాధి హామీ పథకంపై సమీక్ష

  ఉపాధి హామీ పథకంలో మెటల్ రేటును పెంచే విధంగా కృషి చేయాలి ప్రతి గ్రామాలలో ఉపాధి హామీ ద్వారా రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు పనులను కొనసాగాలని జరుగుతుంది అని పేర్కొన్నారు. 

 రెవెన్యూ శాఖపై సమీక్ష  

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి ప్రవేశపెట్టిన వల్ల ప్రజలకు రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ప్రజలకు ఎలాంటి అపోహలు లేకుండా రైతులకు వారికి సంబంధించిన భూములను రెవెన్యూ చట్ట ప్రకారం వారికి కేటాయించే విధంగా పనిచేయాలి ఆ భూమి వారి ఆస్తి అని రైతులు భావించి బతకడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుని న్యాయం చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు.

  సమగ్రా శిశు సంక్షేమ శాఖపై 

  అంగన్వాడి నిలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మెరుగైన పౌష్టికాహారంతో భోజనం అందజేయాలి పిల్లలకు కూడా పౌష్టికాహారులు కలిగిన భోజనం అందజేస్తూ అంగన్వాడిలో పిల్లలను వచ్చే విధంగా కృషి చేయాలి అంగన్వాడి అభివృద్ధి కొరకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

  తాగునీటి సరఫరా పై సమీక్ష 

 గత ప్రభుత్వాల పరిపాలన కాలంలో పలు గ్రామాలలో తాగునీటి కొరకు ఎన్నో ఇబ్బందులను పడేవారు బావిల దగ్గర బోళ్ల దగ్గర వెళ్లి తాగునీటిని తీసుకోచేవారు కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది, దాదాపుగా అన్ని గ్రామాలలో మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు నీళ్లు అందించడం జరుగుతుంది, కొన్ని ఇబ్బందుల వల్ల రెండు మూడు గ్రామాలలో నీటీ కొరత ఉన్నది వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని ప్రజలందరికీ మంచిని పుష్కలమైన మిషన్ భగీరథ నీటిని అందజేయాలని సూచించారు.

  విద్యుత్ శాఖపై సమీక్ష  

గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోని 24 గంటల కరెంటు ఇచ్చి చూపిస్తుంది, సమస్యలు కొన్ని గ్రామాలలో కొంత ఇబ్బంది ఉన్నది వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకు రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

 పంచాయతీ రాజ్ శాఖపై సమక్ష 

  తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి, గ్రామాలలో నిర్మాణం కాబోతున్న బస్తీ దవాఖానలు త్వరగా నిర్మాణం చేసే విధంగా అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ షాది ఖానాలు కూడా త్వరలో నిర్మాణం కావడం జరుగుతుంది ప్రజల ప్రతినిధులు గ్రామాలలో స్థలాలను కేటాయిస్తూ త్వరగా పనులు ప్రారంభించడం జరుగుతుంది, కావున అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో గ్రామ అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రేపు  తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. 
  

  ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి,  పిఎసిఎస్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న, సింగిల్ విండో వైస్ చైర్మన్ విష్ణు, ఎంపిడివో, స్పెషల్ ఆఫీసర్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి లు తదితరులు పాల్గొన్నారు.