ఎమ్మెల్యే సైదన్న ఆపన్న హస్తం

Submitted by Ramesh Peddarapu on Thu, 29/09/2022 - 12:18
MLA Saidanna Apanna Hastam

ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చులు ఇప్పించి, ఆదుకున్న అపద్భాంవుడు

పాలక వీడు,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి);  పాలకీడు మండలం లోని రాఘవపురం లో కరోన తో తీవ్ర అనారోగానికి గురి అయిన ఎ. మంగరావు ని ఆసుపత్రికి తీసుకొని పోయిన విషమించిన పరిస్థితి తో  ఆసుపత్రి  వైద్యానికి నిరకరించగా. ఎమ్మెల్యే స్వయంగా  ఆసుపత్రి యాజమాన్యానికి డాక్టర్ లకు కాల్ చేసి ఎలా అయినా మెరుగైన వైద్యం అందించాలని  ఆదేశించి .వైద్యం అందేలా చేసి మంగరావు  ప్రాణాలు నిలిపినారు.వైద్య ఖర్చుతో ఆర్ధికంగా చితికి పోయిన కుటుంబానికి సి యం ఆర్ యాఫ్ ద్వారాగా 2 లక్షలు వైద్య ఖర్చులు ఇప్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది.  బుధ వారం రోజున హుజూర్నగర్ క్యాంపు కార్యాలయంలో 2 లక్షల సి యం ఆర్ యఫ్ చెక్కును వారికి అందజేయడం జరిగింది.