శ్రీపతిపల్లిలో బతుకమ్మ చీరలు, పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజయ్య

Submitted by bosusambashivaraju on Tue, 27/09/2022 - 12:31
MLA Rajaiah distributed Bathukamma sarees and pension cards in Sripatipalli

చిల్పూర్, సెప్టెంబర్ 26, ప్రజా జ్యోతి:  తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అండగా నిలుస్తున్నారని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఈ సందర్భంగా సోమవారం చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలోని గ్రామాపంచాయతి వద్ద  సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యుష మనోజ్ రెడ్డి రెడ్డి  అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీపతిపల్లి  గ్రామానికి సంబంధించిన ఓల్డ్ పింఛన్లకు సంబంధించిన ఆసరా పింఛన్ కార్డులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి  ఎమ్మెల్యే తాటికొండ  రాజయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా బతుకమ్మ చీరలు పంపించంచడం జరుగుతుందని  తెలిపారు.అందులో భాగంగానే శ్రీపతిపల్లి గ్రామంలోని మహిళలకు  బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే  తెలిపారు.
శ్రీపతిపల్లి గ్రామానికి సంబంధించిన 839 బతుకమ్మ చీరలు మహిళలకు,297 ఆసరా పింఛన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మశెట్టి సరతా బాలరాజు,  ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రంగు రమేష్, రంగు హరీష్ తోపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముఖ్య నాయకులు అధికారులు, మహిళలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.