ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Submitted by bosusambashivaraju on Fri, 30/09/2022 - 15:12
 MLA distributed Bathukamma sarees to girls

 లబ్దిదారులకు ఆసరా పింఛన్ కార్డుల  పంపిణీ 

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 30 ( ప్రజాజ్యోతి ) : -    స్టేషన్ ఘనపూర్  మండల కేంద్రంలోని, మేజర్ గ్రామ పంచాయతి వద్ద గ్రామ సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్  అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో  ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా అందిస్తన్న 4191  బతుకమ్మ చీరలను శుక్రవారం ఎమ్మెల్యే  రాజయ్య  ఆడపడుచులకు అందించారు.  స్టేషన్ ఘనపూర్ మేజర్  గ్రామానికి సంబంధించిన 969 ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే  లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన  ఉద్యమంలో బతుకమ్మ భాగమైందని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత  తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాములను చేయుటకు   ఉద్యమంలో బతుకమ్మలు ఆడడం జరిగిందని తెలిపారు.తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.  ఒక్కచోట చేరి తీరొక్క రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పుట్టింటి కానుకగా కోటికి‌ పైగా చీరలను అందిస్తూ, తెలంగాణ మహిళలకు గొప్ప గౌరవాన్ని ఇస్తున్నారని  తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలు పంపించంచడం జరుగుతోందని తెలిపారు. అందులో భాగంగానే నేడు స్టేషన్ ఘనుపూర్ మేజర్ గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే  తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్, ఎంపీడీఓ, ఎంపీవో, ఎంపీటీసీ గన్ను నరసింహులు, గుర్రం రాజు, ఈవో సత్యం , మండల అధ్యక్షుడు,  ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు , అధికారులు , సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.