టెక్స్ టైల్ పార్కును సందర్శించిన ఎమ్మెల్యే అరూరి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:27
MLA Aruri visited the Textile Park

కాజీపేట, అక్టోబర్03 (ప్రజాజ్యోతి)./...మడికొండ ఇండస్ట్రీయల్ కారిడార్ లోని టెక్స్ టైల్ పార్క్ ను తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి ఈవి నరసింహ రెడ్డి తో కలిసి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడి పరిశ్రమలలో వస్త్రాల తయారు విధానాన్ని, నాణ్యతను ఎమ్మెల్యే అరూరి రమేష్  పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేనేత రంగాన్ని, టెక్స్ టైల్ పరిశ్రమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్ల తెలిపారు. అందులో భాగంగానే చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలతో పాటు టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అనేక సబ్సిడీలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలతో చిన్నాభిన్నం అయిన చేనేత రంగాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత రంగానికి పూర్వ వైభవాన్ని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని అన్నారు. దీంతో వలసలు వెళ్లిన చేనేత కార్మికులు ఇప్పుడు సొంత ఊళ్ళో ఉంటూ చేతి నిండా సంపాదిస్తున్నారని తెలిపారు. టెక్స్ టైల్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 46వ డివిజన్ కార్పొరేటర్, నాయకులు, సంబంధిత అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.