నూతన రేషన్ డీలర్ షాప్ లను ప్రారంబించిన ఎమ్మెల్యే అబ్రహం

Submitted by sridhar on Sun, 11/09/2022 - 14:29
 MLA Abraham who started new ration dealer shops

అలంపూర్: సెప్టెంబర్ 11(ప్రజా జ్యోతి) ఇటిక్యాల మండలం మునగాల గ్రామంలో మరియు గోపాల్ దీన్నే గ్రామాల్లో నూతన రేషన్ డీలర్ షాపులను ప్రారంభించడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూతెలంగణ రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి గ్రామ స్వరాజ్యంపై లోతైన అధ్యయనం చేసి నూతన చట్టాని రూపొందించినారన్నారు

ప్రజలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ఇటిక్యాల  మండలంలోని  మునగాల మరియు గోపాల్ దీన్నే గ్రామాల్లో  నూతన రేషన్ డీలర్ షాప్ ను ప్రారంబించడమైనది అని తెలిపారుఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హనుమంతు రెడ్డీ   వడ్డేపల్లి జెడ్పీటీసీ కశపోగు రాజు  మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డీ  సర్పంచ్ రాధ కృష్ణ రెడ్డీ ఉప సర్పంచ్ జయలక్ష్మి  గోపాల్ దీన్నే రవి  జీవరత్నం మరియు టిఆర్ఎస్ పార్టీ యువకులు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.