క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

Submitted by Degala shankar on Thu, 22/09/2022 - 11:21
Mental joy, physical endurance with sports..  District Collector Rahul Raj..
  • పోటో రైట్ ప్;1)జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్..
  • 2)క్రీడా పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్..
  • 3)మాట్లాడుతున్న ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి,

ఆసిఫాబాద్ ప్రతి నిధి, సెప్టెంబర్,21(ప్రజా జ్యోతి) .../క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతాయని, ఏకాగ్రత పెరిగి చదువులో రాణించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మైదానంలో ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి  తో కలిసి అండర్ 14, అండర్ 15 విద్యార్థుల జోనల్ స్థాయి క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన అనంతరం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడారంగంలో రాణించడంతో చదువులో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల జోనల్ స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి క్రీడారంగంలో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, యువజన క్రీడా అధికారి మణెమ్మ, జెడ్. పి. టి. సి.  నాగేశ్వరరావు, ఎమ్. పి. పి. మల్లికార్జున్, సహాయ గిరిజన సంక్షేమ అధికారి క్షేత్రయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..