హైదరాబాదులో ఘనంగా జరిగిన ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ మర్చంట్స్, సామిల్లర్స్ & ఎలైడ్ ఇండస్ట్రీస్ జనరల్ బాడీ మీటింగ్

Submitted by BikshaReddy on Sun, 18/09/2022 - 19:01
hyderabad

ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ మర్చంట్ సామిలర్స్ అండ్ ఎల్ఈడి ఇండస్ట్రీస్ జనరల్ బాడీ మీటింగ్ హైదరాబాదులోని ఎల్బీనగర్ లో గల శ్రీ లక్ష్మీ నారాయణ భవన్ లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఈ సమావేశంలో పాత బాడీ రద్దు కాగా అన్ని జిల్లాల నుండి హాజరైన ఆయా జిల్లాల కలప వర్తక సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ట్రెజరర్లు మరియు ఇతర  సామిల్ ల యజమానులు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శిని, ట్రెజరర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కార్యవర్గానికి చెందిన వారిలో చకిలం రమణయ్య గారిని రాష్ట్ర అధ్యక్షునిగా గోపి కృష్ణ గారిని ప్రధాన కార్యదర్శిగా , పురుషోత్తం ఎమ్ పటేల్ గారిని ట్రెజరర్ గా,  హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .మిగిలిన కార్యవర్గాన్ని ఒక నెల రోజుల్లో ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు చెకిలం రమణయ్య సభాముఖంగా ప్రకటించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అటవీ శాఖకు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ఎం  డోబ్రియాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గతంలో కఠినంగా ఉన్న జీవో నెంబరు 55ను సవరించి ఇటీవలే జీవో నెంబరు 69 ను వెలువరించామని తెలిపారు  గతంలో సామిల్ యజమానులకు ఇబ్బందిగా ఉన్న కొన్ని రూల్స్ ను సరళీకరించామని ఆయన తెలిపారు భవిష్యత్తులో కూడా అటవీ చట్టం ను సరళీకృతం చేసి అనేక మార్పులను వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ జీవోలో తీసుకు రానున్నట్లు  ఆర్ ఎం  డోబ్రియాల్  తెలిపారు అందులో భాగంగా త్వరలో సామిల్ యొక్క రెన్యువలు, మరియు ఫారం 2, ఫారం 4 ట్రాన్సిట్ పర్మిట్లు ఆన్లైన్ ద్వారా ఇచ్చే విధంగా కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు గతంలో  కఠినం గా ఉన్న చట్టాలను సవరించేందుకు కృషి చేసిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారిని, కొత్త జీవో తెచ్చే వరకు కృషి చేసిన కలప  వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు మిగిలిన సభ్యులను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు సామీల్ ల యజమానులు అభినందించారు  ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గారిని రాష్ట్ర కార్యవర్గం సన్మానించి ఒక జ్ఞాపికను అందజేశారు అనంతరం పలు జిల్లాల నుండి కార్యక్రమానికి విచ్చేసిన ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా పిసిసిఎఫ్ గారికి గారిని సన్మానించారు. అనంతరం  రాష్ట్రకార్యవర్గం అన్ని జిల్లాల  నుండి వచ్చిన అధ్యక్షులు, ,ప్రధాన కార్యదర్శి లను ట్రెజరర్లను సన్మానించి బహుమతులను ప్రదానం చేశారు.

Tags