టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 11:43
Massive additions to the TRS party


దేవరకొండ- సెప్టెంబర్-19( ప్రజా జ్యోతి)../ దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం రోజున ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో  డిండి మండలంలోని కందుకూరు గ్రామ పంచాయతీకి చెందిన 60   కుటుంబాలు   టీఆర్ఎస్ పార్టీలో చేరారు.టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే   రవీంద్రకుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ చేరికలకు కారణం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్  జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొండ శాసనసభ్యుడు రామావత్ రవీంద్రకుమార్ అన్నారు. అదేవిధంగా పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులకు నిరంతరం   కరెంటు అందించిన ఘనత  ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన అన్నారు. నియోజకవర్గంలో లక్షా అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించడమేలక్ష్యమని ,   రైతులకు అండగా ఉండే పార్టీ టీఆర్ఎస్ అని, ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో వంద రూపాయలు   చెల్లించి సభ్యత్వం పొందిన కార్యకర్త  మృతి చెందిన, కార్యకర్త  కుటుంబానికి రెండు లక్షల బీమా చెక్కును అందజేస్తున్నారన్నారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నాదని అన్నారు.  గ్రామాల్లో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళతో దర్శనమిస్తున్నాయని అన్నారు.గ్రామాలలోనూ ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నాయని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చేయాలనే దృఢ సంకల్పంతో రైతుబంధు, రైతుబీమా వంటి  పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు.పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లక్షా నూట పదహారురూపాయలు   మేనమామ కట్నంగా  ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు,ప్రభుత్వం పెన్షన్ అందజేస్తుందన్నారు.దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు.టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో   దేవరకొండ నియోజకవర్గ అభివృద్ది లో భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు.   ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్రావు, రైతుబంధు అధ్యక్షుడు సిరాందాసుకృష్ణయ్య   యువజన విభాగం మండల అధ్యక్షుడు మల్రెడ్డి విష్ణువర్ధన్రెడ్డి బొడ్డుపల్లి కృష్ణ, సంజీవ, విష్ణు బాలు తదితరులు పాల్గొన్నారు.