మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు అవసరం : చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:40
Mahatma Gandhi's ideologies are essential for today's youth: Chief Whip Dasyam Vinay Bhaskar

హనుమకొండ, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./... మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు అవసరమనిచీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 90 లక్షల నిధులతో పబ్లిక్ గార్డెన్ లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గాను భూమిపూజకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కెసిఅర్ నేతృత్వంలో అహింస ద్వారా, శాంతియుతంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా  సంవత్సరం కాలం పాటు స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాలను కలుపుకొని అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని అన్నారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు ఆదర్శమని, అహింసావాదిగా ప్రజల మనసులలో శాశ్వతంగా ఉన్నారని అన్నారు.మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా సత్యం, అహింసల యొక్క గొప్పతనం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. ఆయన సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని, నేటి యువత  ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అలాగే బి.ఆర్.అంబేద్కర్  పేరును  సచివాలయానికి కొత్తగా నిర్మించే సచివాలయాన్ని పెట్టాలని, అసెంబ్లీలో తీర్మానం చేశామని, అలాగే కొత్తగా నిర్మించే పార్లమెంటు భవనానికి కూడా బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సందర్భంగా అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదోడుకులు ఎదుర్కొన్నప్పటికీ శాంతియుతంగా ఉద్యమం చేసి, కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని  అన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్, శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్, హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్  జిల్లా కలెక్టర్ గోపీ, వరంగల్ ఆర్డీవో మహేందర్ జీ, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.