చిట్యాల పదో వార్డులో "లో వోల్టేజ్ "సమస్యను పరిష్కరించాలి

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 17:00
Low voltage" problem should be solved in the tenth ward of Chityala
  • చికిలంమెట్ల  అశోక్
  •  నూతన బాధ్యతలు చేపట్టిన ట్రాన్స్ కో, ఏ ఈ రవీందర్ కి వినతి పత్రం అందజేసి,
  • శాలువాతో ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు, 10వ వార్డు ప్రజలు

చిట్యాల సెప్టెంబర్ 14(ప్రజాజ్యోతి) నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ ముత్యాలమ్మ గూడెం కాలనీ పరిధిలోని అరవింద హైస్కూల్ ఏరియా పదో వార్డులో, 1991లో ఏర్పాటుచేసిన 100 కెవిఎ ట్రాన్స్ ఫార్మర్ పై అధిక లోడు పడి, లో వోల్టేజ్ ఏర్పడి ఇండ్లలో కూలర్లు, ఫ్రిడ్జ్ లు, ఫ్యాన్లు, మోటర్లు, ఏసీలు తగలబడి పోతూ లైట్లు వెలుగక ఆ కాలనీవాసులు అవస్థలు పడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు.గతంలో బదిలీపై వెళ్లిన ఏఈ రమేష్ గారి దృష్టికి అనేకమార్లు తీసుకపోగా ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయించాను, కొత్త ఏఈ వచ్చిన తర్వాత అట్టి ట్రాన్స్ ఫార్మర్ మీ కాలనీలో ఏర్పాటు చేయించుకోవాలని చెప్పాడు.

అట్టి విషయం నూతనంగా విచ్చేసిన ట్రాన్స్ కో  ఏ ఈ రవీందర్ కి బిజెపి నాయకులు చికిలంమెట్ల అశోక్ ఆధ్వర్యంలో పదో వార్డు ప్రజలతో కలిసి  త్వరితగతిన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి" లో వోల్టేజ్" సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది.వెంటనే స్పందించిన ట్రాన్స్ కో  ఏఈ గారు అతి త్వరలో పదో వార్డులో ట్రాన్స్ఫార్మర్ బిగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కన్నేబోయిన మహాలింగం యాదవ్, గంజి గోవర్ధన్, ఏరుకొండ వెంకటేష్, బండగోని వెంకట రాములు, గుండ్లపల్లి లింగస్వామి, గుండెబోయిన మల్లయ్య, పురం పరమేష్ తదితరులు పాల్గొన్నారు.