వసూళ్లకు పాల్పడిన లైన్ మెన్ సస్పెండ్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:27
 Line men involved in collection suspended

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  విద్యుత్ బిల్లులు, మీటర్ల పేరుతో ప్రజలనుండి వసూళ్లు చేసి దుర్వినియోగానికి పాల్పడిన లైన్ మెన్ ను సస్పెండ్ చేసినట్లు విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్ పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామ లైన్ మెన్ రూ.78,000/- వేల రూపాయలు జల్మాల కుంట, ఎల్లప్పకుంట తండాల్లో వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రంలో డీడీ చెల్లించాలని సూచించారు. పట్టణాల్లో 48 గంటలు, రూరల్ లో 4 రోజుల్లో లైన్ మెన్ మీటర్లు ఫిట్ చేస్తారని చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్, ఫోల్ షిఫ్టింగ్ తో పాటు ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా, కేవలం 60 రూపాయల తో డీడీ కట్టి సిఎస్సి లో నమోదు చేసుకోవాలన్నారు. సిబ్బంది కి కరెంట్ బిల్లులు మాత్రమే చెల్లించి వెంటనే రశీదు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సమస్యలకు సూర్యాపేట నియోజక వర్గ ప్రజలు 9440813537, నెంబర్ ను సంప్రదించాలన్నారు.