కీచక ఉపాధ్యాయుడికి ప్రైవేటు విద్యాసంస్థల అధినేత అండ... బాధితురాలికి నాయ్యం జరిగేనా.?... పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ... స్పందించని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు....

Submitted by SANJEEVAIAH on Sun, 29/01/2023 - 15:28
ఫోటో

కీచక ఉపాధ్యాయుడికి అండగా...

 విద్యాసంస్థల అధినేత చక్రం తిప్పుతున్న తీరు

 కేసు నమోదు చేసి చేతులు దులుపుతున్న పోలీసులు

 ఉపాధ్యాయ సంఘాల చోద్యం

 విద్యార్థి సంఘాల మౌనం

 జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఘోరం

ఫోక్ కేసు నమోదు చేసిన ఫలితం శూన్యం

స్పందించని విద్యాశాఖ అధికారులు

 (నిజామాబాద్ క్రైమ్ - ప్రజాజ్యోతి - షేక్ అహ్మద్)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బర్కత్ పురాలోనీ ప్రభుత్వ అప్పర్ ప్రైమర్ పాఠశాల. అందులో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు అరవింద్. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేశారు. సాక్షాత్తు ఈ వ్యవహారంపై విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి నిజామాబాద్ రెండవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తమ పని అయింది అనిపించారు. అప్పటికే మండల విద్యాశాఖ అధికారి రామారావు సైతం ఆఘామేగాల మీద సంఘటనపై విచారణ చేశారు. ఇంతవరకు అంతా హడావిడిగా జరిగినప్పటికీ ఆ తరువాతనే అసలు తంతు మొదలైంది. సదరు ఉపాధ్యాయుడిని కాపాడేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థల అధినేత కిచకె ఆర్ ఆర్ రంగంలోకి దిగి చక్రం తిప్పారు. ఇంకేముంది అటువైపు పోలీసులు అరెస్టు చేయడంలో మీనమేషాలు వేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు చోద్యం చూస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు మౌనం వహించారు. ఎవరికీ ఎంత ముట్టజేపాలో చెప్పేశారు. దట్ ఈజ్ ఆ విద్యాసంస్థల అధినేత కె అర్ అర్ అంటే అంతే మరీ.

అసలేం జరిగింది.?

నిజామాబాద్ నగరంలోని బర్కత్పుర ప్రభుత్వ పాఠశాల (హిందీ మీడియం). అందులో పనిచేసే హిందీ ఉపాధ్యాయుడు అరవింద్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. దీనిపై అప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పలుమార్లు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కానీ ఆ ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోకపోవడంతో సదరు ఉపాధ్యాయుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం ఎలా తయారయింది అంటే చివరకు విద్యార్థినిలు తమ గోడు తల్లిదండ్రుల చెంత చెప్పుకొని బోరున విలపించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులు నిలదీసినప్పటికీ సరైన సమాధానం రాలేదు. పైగా తల్లిదండ్రులను నచ్చజెప్పి ప్రయత్నాలు చేసి వారిపై ఒత్తిడి చేశారు. ఇలా ఈ విషయం బయటకు రాకుండా దాదాపు రెండు మూడు రోజుల కాలయాపన చేశారు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు నిజామాబాద్ రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. దాంతో పోలీసులు ఫోక్స్ చట్టం అమలు చేస్తూ సదరు ఉపాధ్యాయుడు పై కేసు నమోదు చేశారు. ఈ పాఠశాలలో ఆది నుంచి వివాదాలకు కొత్తేమీ కాదు. కానీ ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు ఉపాధ్యాయ సంఘం నాయకుడు కావడంతో  ఎంఈఓ నుంచి జిల్లా స్థాయి డీఈఓ వరకు ఈ పాఠశాల వైపు కన్నెత్తి చూడరు. అందుకే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులదే అంతా ఇష్టారాజ్యం.

ఆ అధినేత ఎవరు.?

 బర్కత్పురా పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిపై వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుపై జిల్లా కేంద్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల అధినేత కె అర్ అర్ రంగంలోకి దిగారు. గతంలో తనకు సౌమ్యుడిగా ఉంటూనే తన పాఠశాలకు కావలసిన వ్యవహారాలను చక్కదిండడంలో సదరు ఉపాధ్యాయుడితో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే  ప్రైవేటు పాఠశాలల అధినేతకు సన్నితుడైన ఓ ఉపాధ్యాయుడు ఓ ఉపాధ్యాయ సంఘానికి నాయకుడు. దీంతో వీరిద్దరూ కలిసి సదరు హిందీ ఉపాధ్యాయుడైన సందీప్ ను కాపాడేందుకు రంగంలోకి దిగారు. ఇంకేముంది చకచకా ఓ అధికార పార్టీ నేత పేరు చెప్పి పాఠశాల నుంచి మొదలుకొని  పోలీస్ స్టేషన్, ఉపాధ్యాయ సంఘాల నేతలను, విద్యార్థి సంఘాల నేతలను, మండల విద్యాధికారి నుంచి జిల్లా విద్యాధికారి కార్యాలయం వరకు అంతా సవ్యంగా జరిగిపోయింది. అలా బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఉపాధ్యాయుదిపై కేసు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఎందుకంటే సదరు ప్రైవేటు విద్యాసంస్థల అధినేత పేరు చెబితే చాలు విద్యాశాఖలో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయడమే. ఎందుకో తెలుసా ప్రతినెల మామూలు అక్కడి నుంచి విద్యాధికారులకు వెళ్లడం షరామాములే. అందుకే ఆ ఆధినేత అంటే అందరికీ కాసుల గౌరవం మరి. అలాంటి అధినేత రంగంలోకి దిగితే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ విద్యార్థినికి తీరని అన్యాయం చేస్తున్నారు. ఇంత జరిగిన పాపము ఉపాధ్యాయ సంఘాల నేతలు నోరు మెదపడం లేదు. చిన్న మార్పు జరిగిన ఓ బదిలీలో చిన్న చోటు చేసుకున్న ఆగం మేఘాల మీద నీతులు వల్లించే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ విషయంలో మాత్రం చోద్యం చూడడం విమర్శల పాలు చేస్తుంది. గురువులు కదా విద్యార్థిని పట్ల ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో మరి.

విద్యార్థి నేతల జాడేది..?

 గంగాస్థాన్ లోని ఓ చిన్న పాఠశాలలోనీ వ్యవహారంపై విద్యార్థి సంఘాల నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంలో పోలీస్ కేసు కూడా నమోదయింది, కానీ పాపం మన విద్యార్థి సంఘాల నేతలకు ఈ విషయంపై స్పందించేందుకు తీరిక లేదేమో మరి. లేక ప్రైవేటు విద్యాసంస్థల అధినేత నెలసరి ఇస్తున్న మామూళ్ల మత్తులో ఉన్నారేమో.? పాపం విద్యార్థిని కోసం నోరు విప్పేందుకు జంకుతున్నారు. మౌనం ఎందుకో మరి విద్యార్థి సంఘాల నేతలే ఆలోచించుకోవాలి.

ఎం ఈ ఓ సారూ...

 నిజామాబాద్ మండల విద్యాధికారి రామారావు పై సాధారణ ఆరోపణలు సర్వసాధారణమే. విద్యాశాఖలో సీనియర్ అధికారి అయిన సదరు ఎంఈఓ ఇలాంటి వ్యవహారాలపై ఆచితూచి స్పందిస్తారు. విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు చేసిన నిర్వాహకంపై ఆఘామేఘాల మీద విచారణ చేశారు. కానీ తదుపరి చర్యలు తీసుకునేందుకు మాత్రం వెనకడుగు వేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక ఇచ్చి చర్యలకు ఉపక్రమించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎం ఈ వో తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షాత్తు పోలీసులే విచారణ చేసి ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసిన చర్యలు తీసుకునేందుకు మాత్రం జిల్లా విద్యాశాఖ అధికారులు వెనకడుగు వేయడం విశేషం. కారణమేమి అయి ఉంటుంది అనుకుంటున్నారా.? ఇంకేం ఉంటుందండి ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత కే.ఆర్.అర్. ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు స్పందించి సదరు బాధితురాలికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. పోలీసులు వెంటనే సదరు ఉపాధ్యాయుని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.