కెసిఆర్ దూర దృష్టితోనే ఆర్టీసీ లాభాల బాట ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 13:58
KCR's long vision is RTC's profit path   RTC Chairman Bajireddy Govardhan

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి)''//  /నిరంతర శ్రామికులు ఆర్టీసీ సిబ్బంది వారి ప్రోత్సాహంతోనే ఆర్టీసీని లాభాల బాటలో పయనిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దూర దృష్టితో చేసిన సంస్కరణల వల్ల ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో ఉద్యోగుల్లో ఉన్న అభద్రతను తొలగించేలా అనేక సంస్కరణలు చేపట్టి సంస్థను లాభాల బాట పట్టిస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ను, మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ తో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా స్థానిక నేతలు, ఆర్టీసీ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్చం అందచేసి ఘణంగా స్వాగతం పలికారు. అనంతరం బస్ స్టాండ్ పరిసరాలను పరిశిలించి ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాల వివరాలను ఆర్.ఎం సుధా పరిమలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లాడుతూ ఆర్టీసీ ద్వార కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. బస్ డిపో ను పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నష్టాల్లో నడుస్తున్న సంస్థను అందరి సహకారంతో లాభాల బాట పట్టిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు, సిబ్బంది సూచనలను పాటిస్తూ ఆదాయాన్ని రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభల్లోకి తీసుకుపోయేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ డిపో నిర్వహణ పట్ల ప్రయాణికులతో పాటు అధికారులు  కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరింత అభివృద్ధి చేసేలా అధికారులు కృషిచేయాలని సూచించారు.

ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ప్రతీ నెలా ఒకటవ తేదీకి వేతనాలు చెల్లించడం సంస్థ పురోగతికి నిదర్శనమని పేర్కొనారు. ఈ కార్యక్రమంలో ఐడి పి ఎం ఎల్ చైర్మన్ సాంబారి మోహన్, నిజామాబాద్ నాయకులు గాడి జితేందర్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు  అశోక్ కుమార్, ఆదిలాబాద్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్  జెయిర్ రంజాని, కౌన్సిలర్లు సంధ నర్సింగ్, ధర్మ పాల్, రామ్ కుమార్,  జాగృతి అధ్యక్షులు రంగినేని శ్రీనివాస్, అధికారులు, ఆర్ఎం సుధా పరిమళ, డి ఎం కల్పన, తదితరులు పాల్గొన్నారు.