కరాటే ఆత్మరక్షణకే కాదు సమాజ శ్రేయాస్సు కు ఉపయోగపడాలి

Submitted by Gonela Kumar on Thu, 08/09/2022 - 19:04
Karate should be useful not only for self-defense but for the welfare of society
  • సినీ హీరో సుమన్

 పంజాగుట్ట, సెప్టెంబర్8 (ప్రజాజ్యోతి) కరాటే కేవలం ఆత్మరక్షణకే కాదు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని సినీ హీరో సుమన్ అన్నారు.గురువారం సోమజిగూడ ప్రెస్ క్లబ్ లోతైక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ అశోక్ చక్రవర్తి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశనికి సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నవంబర్ 6 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలన్నారు. కరాటే ఆత్మ రక్షణే కాకుండా శరీర దారుడ్యాన్ని కూడా పెంచుతుందన్నారు.

 తాను ఆరుపాదుల వయసులో ఉన్నప్పటికీ ఫిట్నెస్  గా ఉండడానికి ప్రధాన కారణం రోజు కరాటే ప్రాక్టీస్ చేయడం వల్లనే అని అన్నారు.ప్రతి పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేకంగా కరాటే క్లాస్ లు నిర్వహించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను 5సంవత్సరాల వయసు నుండే కరాటే నేర్పించాలని సూచించారు.అలాగే నిత్యం ప్రాక్టీస్ చేయడం వల్ల మైండ్ బ్యాలెన్స్ గా ఉండటమే కాకుండా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు.

తైక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ నవంబర్ 6 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీలలో 8 రాష్ట్రాల కరాటే ఫైటర్స్ పాల్గొంటారని, గెలుపొందిన వారికి మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను ప్రధానం చేస్తామన్నారు. ఈ సమావేశంలో గోవర్ధన్ తో పాటు పలువురు కరాటే ఫైటర్స్ పాల్గొన్నారు.