ఘనంగా కనకదుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలు

Submitted by Sathish Kammampati on Fri, 30/09/2022 - 14:19
Kanakadurga Devi Navratri celebrations are grand

 12 రకాల ప్రసాదాలతో అన్నపూర్ణ దేవికి నైవేద్యం

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

చిvట్యాల సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి) .//..నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు లో శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ దేవి 12వ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ సభ్యులు కనకదుర్గాదేవి భవాని మాలధారణ తో అన్నపూర్ణ అమ్మవారికి 12 రకాల ప్రసాదాలతో నైవేద్యం ఎక్కించి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు  అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అమ్మవారిని భక్తులకు దర్శనం ఇస్తున్నామని తెలిపారు. 9 రోజులు అమ్మవారి నవరాత్రులు  ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అంగరంగ వైభవంగా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించి విజయవాడ కృష్ణా నదిలో నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నదాత కంభంపాటి సతీష్, బొబ్బలి శివ శంకర్ రెడ్డి, పత్తిపాటి ప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు బెల్లం నవీన్ కుమార్, సిలివేరు రిశ్వంత్, తీగల శివ, బోయ సురేష్, గండూరి రామకృష్ణ, చింతపల్లి ప్రవీణ్, గూడ అఖిల్, కంభంపాటి సతీష్, బొడ్డుపల్లి ఉపేందర్, పండు, అమ్ములు, రమేష్, ప్రవీణ్, ప్రదీప్, ప్రసాద్, రాజు, నవీన్, భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.