కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చిన జర్నలిస్టులు

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 11:32
Journalists who gave the memorandum to the collector

సూర్యపేట జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని  డి.జె.ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు మెమోరాండం.

సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి)  ../ మద్దిరాల మండలం  సూర్యపేట జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న వర్కింగ్  జర్నలిస్టులకు  సీనియారిటీ,పేదరికం ప్రాతిపదికన [అక్రిడేషన్ ( బస్ పాస్) కార్డుతో సంబంధం లేకుండా] ఇళ్ళ స్థలాలు కేటాయించి,ఇండ్ల నిర్మించుకునేందుకు  రాష్ట్ర కేబినెట్  ప్రత్యేక జి.ఓ జారీ చేసి,వెంటనే అమలు చేయాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డి.జె.ఎఫ్) జిల్లా అధ్యక్షులు రమణ.చొల్లేటి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (డి.జె.ఎఫ్) దేశ వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదురుకుంటున్న సమస్యల సాధన, వాటి పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతుందన్నారు.ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో  పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎలాంటి జీతం,భత్యం లేకుండా సమాజ హితమే  లక్ష్యంగా అనేక కష్టనష్టాలను ఓర్చుకొని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమస్యల సాధనలొ  వారధిగా   నిస్వార్థంగా పని చేస్తూ  తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తునారని తెలిపారు.అయితే నేటికీ ప్రభుత్వాల  నుండి సరైన ఆదరణ,ఆర్థిక చేయూత లభించక అనేక ఇబ్బందులు పడుతున్న  పరిస్థితి నెలకొంది అన్నారు.అక్రిడేషన్ (బస్ పాస్) కార్డు ఉంటేనే జర్నలిస్టులు ప్రభుత్వ రాయితీలు,ఫలాలు పొందడానికి  అర్హులనే చౌక బారు ఆలోచనను ఖండిస్తూ మా సంస్థ(డి.జె.ఎఫ్)  ఉద్యమిస్తుందాని ప్రకటించారు.ఇటీవల ఇళ్ళ స్థలాల విషయంలో  సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు జర్నలిస్టుల్లో కొత్త ఆశలకు ప్రాణం పోసిందని అన్నారుఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి సీనియారిటీ,పేదరికం ప్రాతిపదికన ఇళ్ళ స్థలాలను కేటాయించి,ఇండ్ల నిర్మించుకునేందుకు రాష్ట్ర కేబినెట్ తక్షణమే జి.ఓ జారీ చేసి ,అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇందులో భాగంగా సూర్యపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో   ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి  ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని కోరారు. డిమాండ్స్
1)జర్నలిస్టులందరికి వారి కుటుంబ సభ్యులతోపాటు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలి.
2)జర్నలిస్టుల పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య అందించాలి.
3)జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులతోపాటు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.
4)సీనియారిటీ, పేదరికం ప్రాతిపదికన అర్హులైన జర్నలిస్టులందరికి  డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలి.
5)అక్రిడేషన్ (బస్ పాస్) కార్డులను మార్కెట్ వస్తువుగా మార్చి అమ్మకాలు చేస్తున్న మీడియా సంస్థల అనుమతులను రద్దు చేయాలి.
6)జి.ఓ 239 ను సవరించి చిన్న,మధ్యతరగతి పత్రికలకు  జీవం పోయాలి.
7)స్టేట్ ఐ మరియు పి ఆర్ నిబంధనల మేరకు నమోదైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు రూ:10 లక్షల నుండి 50 లక్షల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.
8)సూర్యపేట జిల్లాలో  అక్రిడేషన్ (బస్ పాస్)కార్డుల జారిలో జరిగిన అవకతవకల వ్యవహారం పై స్టేట్ ఐ మరియు పి ఆర్ సమగ్ర విచారణ చేపట్టాలి. 
9)జర్నలిస్టులు వృత్తిలో భాగంగా మరణించిన పక్షంలో రూ:కోటి రూపాయల ఏక్స్ గ్రేషియో చెల్లించాలి.
10)జర్నలిస్టుల పై దాడులు చేస్తే 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించాలి.
11)జర్నలిస్టులకు శాసన మండలిలో సభ్యుడి (ఏం. ఎల్.సి)గా అవకాశం కల్పించాలి.
12)జర్నలిస్టుల పై కేసులు నమోదు చేయాలంటే ముగ్గురు సభ్యుల తో కూడా స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి విచారించి, నిర్ణయం తీసుకోవాలని మొదలైన  డి.జె.ఎఫ్  డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి , పరిష్కరించగలరని మెమోరాండం లో సూర్యపేట జిల్లా కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యం.డి రెహమాన్ అలీ,మద్దిరాల,తిరుమలగిరి, అడ్డగుడూరు మండల అధ్యక్షులు దండంపల్లి.ఉమేష్, ఎస్.కె.చాంద్ పాషా,కడియం రవి వర్మ లతో పాటుగా సీనియర్ జర్నలిస్టులు ముచ్చ.రమేష్, రాంపాక.సత్తయ్య,దండె .శ్రీనివాస్, మోరగుండ్ల వీరయ్య, దండే సుధాకర్,పోరేళ్ల. వెంకన్న,దరావత్ సంతోష్ నాయక్ ,ఏ.రవికుమార్ ,సమ్మెట.స్వామి,పోరేళ్ల.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.