జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం... 12 లక్షల 99 వేల 484 మంది ఓటర్లు... నియోజక వర్గాల వారీగా జాబితా విడుదల...

Submitted by SANJEEVAIAH on Fri, 06/01/2023 - 08:01
ఫోటో

జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం 

జిల్లాలో 12 లక్షల 99 వేల ఓటర్లు

 తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల కమిషన్ 

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది  ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను గురువారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 12 లక్షల 99 వేల 484 ఓటర్లు ఉన్నట్టు లెక్క తేల్చారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల 1498 మంది పురుషులు, 6 లక్షల 84 వేల 461 మంది స్త్రీలు ఉండగా 35 మంది ఇతరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1509 పోలింగ్ కేంద్రాలను  ఏర్పాటు చేశారు. అధికారికంగా ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వారి వివరాలు మాత్రమే ఇవి. వీరిలో పోస్టల్ ఓటర్లు 812 మంది కాగా పురుషులు 789 గాక స్త్రీలు 23 మంది ఉన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ అర్బన్ లో...

 నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2 లక్షల 68 వేల 901 ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒక లక్ష 30 వేల 270 పురుషులు ,ఒక్క లక్ష 38 వేల 615 మంది స్త్రీలు, ఇతరులు 16 మంది ఉన్నారు. వీరిలో  72 మంది పోస్టల్ ఓటర్లు ఉండగా 67 మంది పురుషులు, ఐదుగురు స్త్రీలు ఉన్నారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో ...

ఆర్మూర్ నియోజకవర్గంలో 214 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్క లక్ష 98 వేల 187 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 92,528 పురుషులు, ఒక్క లక్ష 5 వేల 657 మంది స్త్రీలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. వీరిలో 124 మంది పోస్టల్ ఓటర్లు ఉండగా 120 మంది పురుషులు నలుగురు స్త్రీలు మాత్రమే ఉన్నారు.

బోధన్ నియోజకవర్గంలో...

 బోధన్ నియోజకవర్గంలో 216 పోలింగ్ కేంద్రాలులో 2 లక్షల 4 వేల 212 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 97,987 మంది పురుషులు, 1,06,222 మంది స్త్రీలు ఇతరులు ముగ్గురు ఉన్నారు. వీరిలో  172 మంది పోస్టల్ ఓటర్లు ఉండగా 168 మంది పురుషులు, నలుగురు స్త్రీలు ఉన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలో...

 బాన్సువాడ నియోజకవర్గంలో 237 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో ఒక్క లక్ష 82 వేల 492 మంది ఓటర్లు ఉన్నారు.  వీరిలో 87 వేల 544 మంది పురుషులు, 94,941 మంది స్త్రీలు ఉండగా ఏడుగురు ఇతరులు ఉన్నారు. వీరిలో 195 మంది పోస్టల్ ఓటర్లు ఉండగా 191 మంది పురుషులు, నలుగురు స్త్రీలు ఉన్నారు.

నిజామాబాదు రూరల్ లో...

  నిజామాబాదు రూరల్ నియోజకవర్గంలో 286 పోలింగ్ స్టేషన్లో ఉండగా వాటి పరిధిలో 2,38,896 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో  1,11,290 మంది పురుషులు, 1,27,602 మంది స్త్రీలు ఉండగా నలుగురు ఇతరులు ఉన్నారు. వీరిలో 1080 మంది పోస్టల్ ఓటర్లు ఉన్నారు వీరిలో 185 పోస్టల్ ఓటర్లు ఉండగా 180 మంది పురుషులు ఉండగా ఐదుగురు స్త్రీలు ఉన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలో...

బాల్కొండ నియోజకవర్గంలో 245 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీరిలో 2,06, 796 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95,369 మంది పురుషులు, 1, 11,424 మంది స్త్రీలు ముగ్గురు ఇతరులు ఉన్నారు. వీరిలో 64 మంది పోస్టల్ ఓటర్లు ఉండగా 63 మంది పురుషులు ఒకరు స్త్రీలు ఉన్నారు.