జెఈఈ, ఎంసెట్ ఫలితాల్లో కాలేజీల డొల్లతనం... నామ మాత్రంగా ఫలితాలు...

Submitted by SANJEEVAIAH on Tue, 30/05/2023 - 18:38

జెఈఈ, ఎంసెట్ ఫలితాల్లో కాలేజీల డొల్లతనం

నిజామాబాద్, మే 30 :

పేరుకు కార్పొరేట్ కాలేజీలు కానీ ఫలితాల్లో పూర్తిగా డొల్లతనం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా కాలేజీలపై 2023 జేఈఈ మెయిన్స్ ఫలితాలు, ఏంసెట్ ఫలితాలపై చిన్న విశ్లేషణ ఇది.

ఏ కాలేజిలో తల్లిదండ్రులు తమ పిల్లలను అడ్మిట్ చేయించాలి. ఆ కాలేజీ జేఈఈ మెయిన్స్, ఏంసెట్ 2023 ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై అనేక మంది తల్లిదండ్రులు చాల తికమకలో ఉన్నారు. ఏ కాలేజిలో 2023 జేఈఈ మెయిన్స్, ఏంసెట్ లో ఫలితాలు ఎలా ఉన్నాయి. ఇవి ప్రక్క రాష్ట్ర ర్యాంకులా.? ప్రక్క జిల్లా ర్యాంకులా.? లేక ఇంటర్ మీడియట్ మార్చి 2023లో పరీక్షలు వ్రాసి, తొలి ప్రయత్నంలో వచ్చిన జేఈఈ మెయిన్స్, ఏం సెట్ ర్యాంకులా.? లేక లాంగ్ టర్మ్ ర్యాంకులా.? అనేది 10వ క్లాస్ పూర్తి చేసిన తమ పిల్లల తల్లిదండ్రులకు వివిధ విద్యావేత్తలు, అధికారులు, రిజల్ట్ వచ్చిన రోజున ఇచ్చిన వార్తా ప్రకటన ఆధారంగా ఈ విశ్లేషణ చేయటమైనది. ఏప్రిల్ 30, 2023 వ తారీకున 2023 జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చాయి కాలేజీల వారీగా సాధించిన ఫలితాలు మచ్చుకి ఇవి. 

ఏ.సిద్ధార్థ - 99.77 - కాకతీయ కాలేజ్, 
వి.సాయి అక్షయ్ - 99.29 - కాకతీయ కాలేజ్,
కె.సాత్విక్ - 98.73 - కాకతీయ కాలేజ్,
కె. హర్షిత్ - 97.47 - విక్టరి కాలేజ్,
ఆస్మా - 97.44 - కాకతీయ
ఎస్ ఆర్ భువన - 97.42 - కాకతీయ కాలేజ్ ఉంది.

2023 ఏంసెట్ ఫలితాలను మే 25, 2023న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా కాలేజిల వారీగా వారు సాధించిన ర్యాంక్ ల వివరాలు.

ఏ సిద్ధార్థ - 409 - కాకతీయ
వి. సాయి అక్షయ్ - 613 - కాకతీయ
సి.నిశిత - 1404 - విక్టర్
పి.వినయ్ - 1670 - విక్టర్
ఎం.స్నేహ - 1859 - కాకతీయ
కె.సాత్విక్ - 1942 - కాకతీయ
కె.వైభవ్ - 2246 - కాకతీయ
జి. జోష్న - 2348 - సోషల్ వెల్ఫేర్
ఈ. ప్రవళిక - 2457 - ఎస్ ఆర్ కాలేజ్
ఎం.పావని - 2950 - ఎస్ ఆర్ 
ఎస్.సాహితీ - 2991 - ఎస్ ఆర్ కలదు.

నిజామాబాద్ కార్పోరేట్ కాలేజీలు, కార్పోరేట్ స్కూల్లు వేరే రాష్ట్రంలో వచ్చిన ర్యాంకులను, వేరే జిల్లాల్లో వచ్చిన ర్యాంకులను నిజామాబాద్లో వచ్చినట్లుగా చూపడం ఘరాన మోసం. దీనిపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. నిజామాబాద్లో కార్పోరేట్ కాలేజిలు, కార్పోరేట్ స్కూలు విద్యార్థులకు పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ నీట్, ఏంసెట్  లలో ర్యాంకులు ఎందుకు రావడం లేదు.? టీచర్లు, లెక్చరర్లలకు సరైన అనుభవం లేదా.? టీచర్లు, లెక్చరర్లు సరైన అర్హత లేనివారా.?నిజామాబాద్లో కార్పోరేట్ కాలేజిలు, కార్పోరేట్ స్కూల్లు అనుభవం, అర్హత లేని, ఎవరు తక్కువ జీతానికి దొరికితే వారిని టీచర్లుగా, లెక్చరర్లుగా నియమించుకొని సరైన శిక్షణ ఇవ్వడం లేదా.? లేదా నిజామాబాద్లో కార్పోరేట్ కాలేజిలు, కార్పోరేట్ స్కూల్లు నాసిరకం టీచర్లతో, లెక్చరర్లతో చెప్పిస్తున్నారు. తల్లిదండ్రులారా ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకోండి. ఎక్కడో ఇతర రాష్ట్రాలలో వచ్చిన జేఈఈ మెయిన్స్ ర్యాంకులు మన జిల్లాల్లో వచ్చినట్లు పెద్ద పెద్ద మల్టీకలర్ ఫాంప్లెంన్స్ తల్లిదండ్రులకు ఇస్తూ స్టేటస్ పెట్టుకుంటు తల్లిదండ్రులకు వాట్సప్ పంపుతూ ఇన్ని జేఈఈ మెయిన్స్ ర్యాంకులు వచ్చాయంటూ అటు తల్లిదండ్రులను ఇటు విద్యార్థులకు భ్రమను కల్పిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఆ క్షనికావేశంలో అవన్ని నిజమని నమ్మిన తల్లిదండ్రుల నుండి అడ్మిషన్లు దండుకోవడం.

వాస్తవంగా ఉదాహరణకు నిజామాబాద్ కార్పోరేట్ కాలేజీ & కార్పోరేట్ స్కూల్లు మల్టికలర్ ఫాంప్లెంట్లో కనీసం మన జిల్లా నుండి ఒక్క విద్యార్ధి అయిన ఉండక పోవడం, పైగా వీరందరూ మన జిల్లా విద్యార్థులని భ్రమ కల్పించడం తల్లిదండ్రలను, విద్యార్థులను మోసం చేయడం ఎంత వరకు కరెక్ట్.? నిజామాబాద్ లోని ఒక కార్పోరేట్ కాలేజీ కనీసం 2 వేల మంది విద్యార్థులను పరీక్ష రాయించి ఒక్క ర్యాంకు కూడా మన జిల్లా విద్యార్ధికి రాలేదంటే ఆ విద్యాసంస్థ లోపమా.? టీచింగ్ స్టాఫ్ లోపమా.? ప్రణాళిక లోపమా.? విద్యార్థులను సరైన మార్గంలో నడిపించలేక పోవడమా ? తల్లిదండ్రుల అమాయకత్వమా.? తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేయడమే ధ్యేయమా ?

జేఈఈ ఫలితాలు & ఏంసెట్ ర్యాంకులు మన నిజామాబాద్లో లో వచ్చిన ఫలితాల విశ్లేషణ ఇవ్వటమైనది. ప్రస్తుతం ఇంటర్ మార్కులకు విలువలేదు. ప్రస్తుతానికి జే ఈ ఈ మెయిన్స్, ఏం సెట్ ఫలితాలు వచ్చినందున మన జిల్లాలో ఏఏ.. కాలేజికి జే ఈ ఈ మెయిన్స్, ఏం సెట్ ర్యాంకులు వచ్చినయో విశ్లేషణ చేసుకొని తల్లిదండ్రులు తమ పిల్లల యెడల ఆలోచించి నిర్ణయించుకోండి.

నిజామాబాద్ లోని కార్పోరేట్ కాలేజి & నిజామాబాద్లోని కార్పోరేట్ స్కూల్లు అడ్మిషన్ ఇంచార్జిలని నియమించుకొని విద్యార్థులను ప్రలోభపెట్టి, మా కార్పోరేట్ కాలేజి & కార్పోరేట్ స్కూల్ల గురించి మంచిగా చెప్పండి. మిమ్ములను సంవత్సరం మొత్తం స్నేహ పూర్వకంగా చూసుకుంటాం, 5 అడ్మిషన్లు చేస్తే మీకు ఫ్రీగా అడ్మిషను తీసుకుంటాము, అడ్మిషన్ చేపిస్తే పార్టీలు చేసుకుందాం, అడ్మిషన్ల కొరకు స్వీటు బాక్సులు, గిఫ్ట్ బ్యాగులు ఇవ్వడం అడ్మిషన్లకు ఇన్ని పైసలు ఇస్తాం అని విద్యార్థులను ప్రలోభ పెట్టి, విద్యార్థుల జీవితాలతో వాళ్ల అమాయకత్వంతో ఆడుకుంటున్నారు. ఇంకా కొన్ని కార్పొరేట్ కాలేజిల అస్త్రంలు ఎక్కడైనా అడ్మిషన్లు ఉంటే వారి తండ్రి కులం ద్వారా లొంగుతాడా, ఆ తండ్రి ఎవరికి తెలుసు, ఆ తండ్రి స్నేహితుల ద్వారా లొంగుతాడా, గ్రామ పెద్ద ద్వారా లొంగుతాడా, అని వివిధ ప్రలోభాలు చేయడం ఇలా అడ్మిషన్ల ప్రక్రియ పరాకాష్టకు చేరింది.

తరువాత అడ్మిషన్ అయి క్లాసులు ప్రారంభం కాగానే ఆ కాలేజి గురించి అసలు డొల్ల తనం, లోపాలు, క్రమశిక్షణ లేకపోవడం వంటి కారణాల వల్ల తల్లిదండ్రులు & విద్యార్థులు అవాక్కయ్యే పరిస్థితులు కోకొల్లలు. కాని అప్పటికే మాయ మాటలు చెప్పి సర్టిఫికెట్స్ తీసుకొని తల్లిదండ్రుల విద్యార్థుల స్వేచ్ఛను హరించి వారు వేరే కాలేజికి పోకుండా చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. విద్యార్థులారా, తల్లిదండ్రులారా ఆలోచించండి.