కల్వకుర్తి స్టేడియాన్ని గురుకులకు కేటాయించడం సమంజసం కాదు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుమన్,

Submitted by p naresh on Fri, 30/09/2022 - 13:24
It does not make sense to allocate the Kalvakurti Stadium to the Gurus.  ABVP state executive member Suman,

ఆర్డీఓ కు వినతిపత్రం అందజేత,
కల్వకుర్తి,సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి):  
కల్వకుర్తి మినీ స్టేడియం, భవనాలను గురుకుల పాఠశాలకు కేటాయించడం  సమంజసం కాదని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుమన్ అన్నారు.గురుకుల పాఠశాల కేటాయించిన స్టేడియం,భవనాలను తిరిగి క్రీడాకారులకే కేటాయించాలని కోరుతూ గురువారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుమన్ ఆధ్వర్యంలో ఏబీవీపీ కల్వకుర్తి శాఖ సభ్యులు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు కోసం ఏబీవీపీ నాయకులు,క్రీడాకారులు, పట్టణ ప్రముఖులు కొన్ని  సంవత్సరాలు పోరాడితేనే స్టేడియం వచ్చిందని గుర్తు చేశారు.స్టేడియం నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రారంభానికి నోచుకోక ముందే స్థానిక ప్రజాప్రతినిధులు గురుకుల పాఠశాలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.గురుకుల పాఠశాలకు సరైన మౌలిక వసతుల గృహాలను నిర్మించీ విద్యార్థులకు తగిన న్యాయం చేస్తూ కల్వకుర్తి మినీ స్టేడియాన్ని తక్షణమే క్రీడాకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

స్టేడియం, భవనాలను క్రీడాకారులకు కేటాయించని పక్షంలో ఏబీవీపీ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ డి కన్వీనర్ ప్రశాంత్,ఏబీవీపీ నాయకులు ఉమేష్,అభి, నరేష్,శ్రీకాంత్,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.