చిట్యాల విజయ పాలసేకరణ కేంద్రంలో అక్రమాలు!

Submitted by Anagoni Rajanikanth on Mon, 05/09/2022 - 18:23
Irregularities in Chityala Vijaya Palasekarana Center!

సిద్దిపేట ప్రతినిధి ప్రజాజ్యోతి :సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామంలో పాల ధరలను అధిక రేట్లకు అమ్ముతున్నారని విజయ పాల ఉత్పత్తిదారుల సంఘం వద్ద నిరసన వ్యక్తం చేశారు పాల వినియోగదారులు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం లోని పాల కేంద్రంలో లీటర్ పాలు 80 రూపాయలకు అమ్ముతున్నారని, పక్క గ్రామాలలో 64 రూపాయలకు అమ్ముతున్నారన్నారు. కాగా ఈ విషయంపై చైర్మెన్ కట్కూరి మల్లేశం ను పలువురు వినియోగదారులు నిలదీయగా " కొనకండి ఎవరు కొనమంటున్నరు " అని దురుసుగా సమాధానం ఇవ్వడం కోసం మెరుపు అలాగే ఇందులో విచిత్రం ఏమంటే పాల ధర పెంచిన విషయం తనకు తెలియదు అని తప్పించుకున్నాడు చెర్మన్ కాగా వేతన కార్యదర్శి రాములు తానే స్వయంగా ధర పెంచిండా లేక డైరెక్టర్లతో కూడిన కమిటీ పెంచిందా తెలియాల్సి ఉంది పాల సేకరణ కేంద్రంలో బర్రె పాలలో ఆవు పాలు కలిపి అమ్ముతున్నారని పలువురు ఆరోపించారు. కమిటీ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు దాటిపోయిన నూతన కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు ప్రస్తుతం ఉన్న చైర్మన్ పర్మినెంట్ చైర్మన్ గా ఉండడానికి అసలు కారణాలు ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు మేల్కొని చిట్యాల పాల కేంద్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని కోరారు