పీవీకే 5షాఫ్ట్ లో ఐ న్ టీ యూ సి సెంట్రల్ కమిటీ గేట్ మీటింగ్.

Submitted by Srikanthgali on Wed, 14/09/2022 - 17:34
INTUC Central Committee Gate Meeting in PVK 5 Shaft.

పీవీకే 5షాఫ్ట్ లో ఐ న్ టీ యూ సి సెంట్రల్  కమిటీ గేట్ మీటింగ్.

కొత్తగూడెం క్రైమ్, సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి: కొత్తగూడెం ప్రాంతంలోని సింగరేణి పీవీకే 5షాఫ్ట్ లో బుధవారం ఐ న్ టీ యూ సి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ ఆదేశాలప్రకారము కొత్తగూడెం ఏరియా ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కే ఆల్బర్ట్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంకు ఐ ఎన్ టి యూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా జనరల్ సెక్రెటరీ త్యాగరాజు అధ్యక్షత వహించారు. సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో ప్రముఖ్యత సంచరించుకొని తెలంగాణ రాష్ట్రానికే తల మానికంగా ఉన్న సింగరేణి సంస్థను టి జి బి కే ఎస్ యూనియన్ అసమర్థత చేతగానితనము వలన రాజకీయ జోక్యం ఎక్కువై సింగరేణి సంస్థకు చెందిన వేలకోట్ల రూపాయలు అన్యాయక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యంతో సింగరేణి పరిసర ప్రాంతాలలోనే కాకుండా సింగరేణి నిధులు చుట్టుపక్కల ఉన్నటువంటి సిద్దిపేట, హైదరాబాదు, సిరిసిల్ల ప్రాంతాలకు ఇచ్చి సింగరేణి సంస్థను నష్టాల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. టీజీబికేఎస్ యూనియన్ కాల పరిమితి అయిపోయినప్పటికీ యూనియన్ ఎలక్షన్లు పెట్టకుండా కాలయాపన చేస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 72000 మంది కార్మికులు ఉన్న సింగరేణి సంస్థలో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో 42,000 మంది కార్మికులై ఎన్నో మైన్స్ మూతపడి కొత్త మైన్స్ తెరవక మైన్స్ ను ఓపెన్ కాస్ట్ లుగా మారుస్తూ కార్మిక వర్గాన్ని తగ్గిస్తూ సంస్థను ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తూ సింగరేణి మనగడ దెబ్బతీస్తున్న ఈ టీఆర్ఎస్, టీజీబికేఎస్ ను కార్మికులు గమనిస్తున్నారని సింగరేణి కి రావలసిన బకాయిలు 12 వేల కోట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కి చెల్లించి కొత్త అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాలని అన్నారు. ఇంకా ఎంతో ముఖ్యంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన స్పందిస్తూ ఎంతో అనుభవమున్న ఐ ఎన్ టి యు సి దేశంలోనే ఒక కోటి 33 లక్షల పైగా సభ్యత్వం కలిగి ఉన్న ఐ ఎన్ టి యు సి యూనియన్ తోనే సింగరేణి మనుగడ ఉంటుందని కార్మికులకు తెలియజేస్తూ ఐఎన్టీయూసీ తలపెట్టిన సింగరేణి పరిరక్షణ పోరాటానికి కార్మికులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు. రమణయ్య. వెంకటస్వామి, శంకర్, గట్టు శ్రీను, సూరిబాబు, రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు