తొర్రూర్

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 25న కబడ్డీ పోటీలు

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 17:52

తొర్రూరు సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి) ../ దేశం గర్వించదగ్గ విప్లవకారుడు అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప దేశభక్తులు భగత్ సింగ్ 115 వ జయంతి సందర్భంగా వరుణ్ సిద్ధార్థ్ అండ్ అసోసియేట్స్ వారి సౌజన్యంతో ఎస్ఎఫ్ఐ తొర్రూర్ డివిజన్ కమిటీ  ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఆదివారం రోజు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించనున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వరుణ్ సిద్ధార్థ (సిఏ) మాట్లాడుతూ విద్యార్థులు యువత ఈ రోజులలో చెడు అలవాట్లకు బానిస అవుతున్నారని విద్యార్థులు యువత జీవితంలో ఎదగాలంటే ఏదో ఒక రంగాన్ని ప్రొఫెషనల్ గా తీసుకొని జీవితంలో ఒక మ

ప్రజలను చంపిన రోజు పండుగ జరుపుతారా

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 17:14

 మహబూబాబాద్ తొర్రూరు సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి) .  యూనియన్ సైన్యం నైజాం నవాబు రజాకార సైన్యం తెలంగాణ ప్రజలపై దాడులు చేసి అమానుషంగా 4000 మందిని చంపితే అది పండుగ రోజు ఎలా అవుతుందని సిపిఐ (ఎంఎల్ )ప్రజాపందా తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. తొర్రూర్ ప్రజాపంద పార్టీ కార్యాలయం ముందు నేడు పార్టీ ఆధ్వర్యంలో విద్రోహ దినాన్ని జరిపారు 1948 సెప్టెంబర్ 17న ఒక్క తుపాకీ తూటా పేలకుండానే నైజాం నవాబు ఇక్కడి భూస్వాముల ఒత్తిడితో యూనియన్ సైన్యానికి లొంగిపోయి తెలంగాణ ప్రాంత ప్రజలపై రాక్షస దమనకాండము జరిపిన రోజు విలీనమ?విముక్తా?ప్రజల ఆలోచించాలని ఆయన అన్నారు.

విద్యార్థుల సామర్థ్యాల పెంపుకై తొలిమెట్టు తొలిమెట్టు మూల్యాంకన యాప్ పై అవగాహన

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:24

 తొర్రూరు సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి) .  విద్యార్థుల్లో ప్రాథమికంగా నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని మండల విద్యాశాఖ అధికారి గుగులోతు రాము అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్రూర్ లో గురువారం తొలిమెట్టు మూల్యాంకానికై రూపొందించిన యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో అమలవుతున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని మూల్యాంకనం చేయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం యాప్ను రూపొందించిందని తెలిపారు.

గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

Submitted by K.KARUNAKAR on Wed, 14/09/2022 - 16:50


తొర్రూరు సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ ధరావత్ జై సింగ్ నాయక్,టిఆర్ఎస్ ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు జాటోత్ స్వామి నాయక్ తెలిపారు.బుధవారం డివిజన్ కేంద్రంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఎస్టీ సెల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈనెల 17న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఆదివాసి, బంజారాల భవన ప్రారంభోత్సవం జరగనుందని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బంజారా భవన్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమానికి మండలంలోని గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలు కొనసాగిద్దాం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:35

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం.    

 సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్.