ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

Submitted by Yellaia kondag… on Sat, 01/10/2022 - 10:17
 Inappropriate comments on RSP should be withdrawn


బీఎస్పీ నేత దాసరి శ్రీను హెచ్చరిక

తుంగతుర్తి, సెప్టెంబర్ 30(ప్రజా జ్యోతి)./... బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై గడీల బానిస,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా నాయకులు దాసరి శ్రీను డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో  బీఎస్పీ రాష్ట్ర అద్యక్షుడు ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ చేసిన  అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఎస్పీ మండల ఇంచార్జి కొమ్ము జయరాజు ఆద్వర్యంలో ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేయడానికి ప్రత్నిస్తుండగా  పోలీస్ లు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.ఈ సంధర్భంగా దాసరి శ్రీను మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల బహుజనుల పక్షాన నిలబడి, బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా తన ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి, ప్రజల సమస్యలను,  తెలుసుకుంటూ,క్షేత్ర స్థాయిలో బహుజనం పడుతున్న బాధలనుచూస్తూ వారికి మనో ధైర్యాన్ని కల్పిస్తూ,వారిని బహుజన రాజ్యంలో భాగస్వాములుగా చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారనీ అన్నారు.అలాంటి వ్యక్తిపై ఓ బహుజన బిడ్డవై ఉండి,దొరల గడీల దగ్గర ఊడిగం చేస్తూ చెంచాగిరి చేసే నువ్వు అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు.


ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకుండా అలాగే మొరిగితే తెలంగాణ రాష్ట్రంలోని బహుజనులు చూస్తూ ఊరుకోరని, నిన్ను ఎక్కడా తిరగక కుండా చేస్తారని ఖబర్దార్ అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఇద్దరు ఎంపీలు కూడా లేనప్పుడు 36 మంది ఎంపీలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.తక్షణమే డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కి  క్షమాపణ చెప్పాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో బహుజన ప్రజాక్షేత్రంలో నీకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు.ఈకార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జోగునూరి సుందర్ రావు, లక్ష్మణ్,రవి, వెంకన్న, కుమార్ తదితరులున్నారు.