చాకలి ఐలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు

Submitted by Satyanarayana on Mon, 19/09/2022 - 09:16
Inappropriate comments on Chakali Ailamma will not be tolerated

 చాకలి ఐలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్

 

సత్తుపల్లి, సెప్టెంబర్ 18 ప్రజాజ్యోతి:

రజకుల జోలికొస్తే గుడ్డలూడదీసి కొడతాం ప్రకాష్ రెడ్డి నీ నాలుక అదుపులో పెట్టుకో లేకుంటే నాలుక చీరేస్తాం ఖబర్దార్ బిడ్డ ,అంటూ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ హెచ్చరించారు. రజక సంఘం పట్టణ అధ్యక్షుడు బెల్లంకొండ రాము ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని ధోభీఘాట్ నందు గల తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, రింగ్ సెంటర్ లో బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి దిష్టి బొమ్మని దహనం చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని, అటువంటి గొప్ప మహనీయులను కించపరిచే హక్కు ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తికి , ఏ రాజకీయ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఒక మహిళగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసినటువంటి వీరోచిత పోరాటం ఆమె యొక్క పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకొని నాటి నుంచి ఎన్నో ఉద్యమాలు ఈ రాష్ట్రo లో నడిచాయని, అంతే కాకుండా సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రాన్ని చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి తోనే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాo అని చెప్పినటువంటి విషయాలను ఈ దద్దమ్మలు తెలుసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రజకుల ఆత్మ గౌరవ ప్రతీకయినటువంటి చాకలి ఐలమ్మను కించపరిస్తే రజక సమాజం చూస్తూ ఊరుకోదని, తమకు బట్టల ఉతకటమే కాదు నోరు అదుపులో పెట్టుకోలోని వారిని కూడా ఉతకటం తెలుసునన్నారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని చిట్టెలుక తో పోల్చిన బిజెపి నాయకుడు ప్రకాష్ రెడ్డి మాట్లాడిన నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న భారతీయ జనతా పార్టీ లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఈటల రాజేందర్, బండి సంజయ్ , ఎంపీ అరవింద్ కానీ స్పందించక పోవటం బాధాకరమన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు అమ్మగా భావించే చాకలి ఐలమ్మ ను కించపర్చిన ప్రకాష్ రెడ్డిని వెంటనే బిజెపి నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. 

రజక సంఘాలకు మద్దతు పలికిన టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్

సత్తుపల్లి పట్టణ కేంద్రంగా రజక సంఘలా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు బండి ప్రకాష్ రెడ్డి మీద పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గోని రజక సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ యొక్క త్యాగం చాలా గొప్పదని, అటువంటి మహనీయుల త్యాగాలను మనం స్మరించుకోవాలే తప్ప , అటువంటి మహనీయుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి బేషరతుగా రజక సమాజానికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేంత వరకూ రజక సంఘాలు చేసేటువంటి ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామకృష్ణ, రజక సంఘం నాయకులు తెలగారపు అప్పారావు, టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు మరికంటి శీను, నిమ్మగడ్డ శ్రీకాంత్, విరివాడ నాగభూషణం, రాము, చింతల సత్యనారాయణ, టోపీ శ్రీనివాస్, రాయల కోటి, కోట, రామ్మూర్తి ,సాంబ పెద్ద ఎత్తున రజకులు, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.