ఐలమ్మ పోరాటం నిత్యస్ఫూర్తిదాయకం. బెంగళూరు రచయిత్రి కె.శాంతి కుమారి

Submitted by lenin guduru on Mon, 21/11/2022 - 10:06
శాంతకుమారి

ఐలమ్మ పోరాటం నిత్యస్ఫూర్తిదాయకం

  • పాలకుర్తి లో చాకలి ఐలమ్మ  మ్యూజియం ఏర్పాటు చేయాలి

  •  బెంగళూరు రచయిత్రి కె.శాంతి కుమారి

పాలకుర్తి, నవంబర్ 21,(ప్రజాజ్యోతి):-

వీరనారి ఐలమ్మ పోరాటం నిత్యస్ఫూర్తిదాయకమని, ఆమె గురించి భవిష్యత్ తరాలకు తెలిసేందుకు 
చాకలి ఐలమ్మ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలకుర్తిలో ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయాలని బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయిత్రి, ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  ఐ.ఎఫ్.డబ్ల్యూ.జె జాతీయ ఉపాధ్యక్షురాలు కే.శాంతి కుమారి అన్నారు.
సోమవారం పాలకుర్తిలోని ఐలమ్మ ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
 ఐలమ్మ గురించి సమగ్రంగా పుస్తకం రావాల్సిన అవసరం ఉందని ఆమె
తాను వేసిన పుస్తకంలో వీరనారి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, మోటూరు ఉదయం, సుందరయ్య  గురించి ప్రత్యేకంగా రాసానని ఆమె తెలిపారు. 

  •  ఐలమ్మ పుస్తకానికి కేంద్ర సాహిత్య అవార్డు ఎందుకు రాలే

మామిండ్ల రమేష్ రాజా రాసిన విప్లవ మూర్తి పుస్తకానికి కేంద్ర సాహిత్య అవార్డు రావాల్సి ఉండేనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. పుస్తకం చిన్నదా పెద్దదా అని చూడకుండా అవార్డు ఇవ్వాలన్నారు. 2015 లో పుస్తకం తీసుకు వచ్చినట్లు రమేష్ రాజా ఆమెకు చెప్పారు.

  •  జర్నలిస్టులకి 15 వేల పెన్షన్ ఇవ్వాలి

జర్నలిస్టులందరికీ కన్నడ తరహాలో 15000 ప్రతినెల పెన్షన్ ఇవ్వాలని శాంత కుమారి ప్రభుత్వాన్ని కోరారు. అక్కడ పెన్షన్ కమిటీ సభ్యురాలుగా ఉండి పోరాడి పెన్షన్ సాధించానని ఆమె చెప్పారు. జర్నలిస్టు చనిపోయాక ఐదు లక్షలు ఇవ్వడం కాదని బతికుండగానే ప్రతినెల పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలన్నారు. ప్రతి జర్నలిస్టుకు ఇంటిని నిర్మాణం చేసి ఇవ్వాలని అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి, విప్లవ మూర్తి ఐలమ్మ పుస్తక రచయిత మామిండ్ల రమేష్ రాజా, ఐలమ్మ వారసులు,, మాజీ సర్పంచ్ చిట్యాల.రామచంద్రం,  చిట్యాల.సంపత్, స్థానికులు తదితరులు ఆమె వెంట ఉన్నారు .