బిఎస్సి పార్టీ అధికారంలోకి వస్తే భూమిలేని ప్రతి పేదవాడికి ఎకరం భూమి ఇస్తాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Submitted by mallesh on Fri, 23/09/2022 - 10:01
If BSC party comes to power we will give an acre of land to every landless poor RS Praveen Kumar

చౌటుప్పల్ సెప్టెంబర్ 22( ప్రజా జ్యోతి) ..//., నిధులు నియామకాలు కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, ప్రభుత్వ పాఠశాలను పాడు పడ్డ గృహాలుగా మారాయని బిఎస్సి పార్టీ రాష్ట్ర  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్ పేట్ గ్రామం నుండి రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మసిబట్టల కన్నా హీనంగా ఉన్న బతుకమ్మ చీరల మీద ఉన్న శ్రద్ధ , ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, మౌలిక వసతులు కల్పించడంలో లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతకాక, తన స్వార్థ ప్రయోజనాల కోసం 30 వేల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయారని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల అభివృద్ధి కోసం తన ఉద్యోగం కు రాజీనామా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానన్న రాజగోపాల్ రెడ్డి , తాను సంపాదించుకున్న ఆస్తులను ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ,వందల కోట్లు సంపాదించిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తన ఆస్తులను  ప్రజలకు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని, కోమటి రాజగోపాల్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు.

2023 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే భూమిలేని ప్రతి కుటుంబానికి ఎకరం భూమి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నాయనమైన విద్యను అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో  బిఎస్పి జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, బీఎస్పి మునుగోడు నియోజకవర్గ నాయకుడు కర్నాటి శ్రీనివాస్, పల్లె లింగస్వామి, నియోజకవర్గ ఇన్చార్జిలు కార్తీక్ గౌడ్, అయితే రాజు అభయేందర్, ఏర్పుల అర్జున్, నల్లగొండ ఈసీ నెంబర్ మామిడి ప్రమీల, నియోజకవర్గ మహిళ కన్వీనర్ కత్తుల పద్మ, మండల అధ్యక్షుడు తగరం సుభాష్ చంద్రబోస్, మల్కాపురం సెక్టార్ అధ్యక్షుడు సుక్క బుగ్గ రాములు, నాయకులు కత్తుల పరమేష్ వెల్దురు శివ తదితరులు పాల్గొన్నారు.